హెల్త్ టిప్స్

ఉల్లిపాయ తొక్కలతో ఎన్ని ప్రయోజనాలో….!

ఉల్లిపాయలు లేకుండా వంట చేయము. అయితే మనలో చాలా మంది ఉల్లిపాయ తొక్కలని పడేస్తూ ఉంటారు. కాని వాటి ఉపయోగాలు తెలిస్తే మాత్రం అసలు పడేయరు. అవేమిటో తెలుసుకుందాం.ఉల్లిపాయలే కాదు ఉల్లి తొక్కలు కూడా మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడ‌తాయి. ఉల్లి తొక్క‌లని రాత్రంతా నీటిలో నాన పెట్టి ఉదయాన్నే కీళ్ళు నొప్పులుగా ఉన్న చోట రాస్తే నొప్పులు త్వరగా తగ్గుతాయి.

స్నానానికి అర గంట ముందు ఈ నీటిని శరీరం మొత్తం రాసి స్నానం చేస్తే చర్మ సమస్యలు తొలగిపోతాయి. ఉల్లి తొక్కలను నూరి ఆ పేస్ట్ ని తలకు పట్టించి పావు గంట తరువాత సాధారణ షాంపుతో తలంటుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే తలలో చుండ్రు, జుట్టురాలే సమస్యలకు మంచి ఔషధంగా పనిచేసి జుట్టు నల్లగా, దృడంగా పెరుగుతుంది.ఉల్లిలోని సల్ఫర్ సన్నగా, బలహీనంగా ఉన్న జుట్టు కుదుళ్ల ను బలంగా పెరిగేలా చేస్తాయి.

many wonderful health benefits of onion peels

జుట్టు సమస్యలకు ఉల్లిపాయలు, తొక్కలు కూడా అద్భుతంగా పనిచేస్తాయని కొన్ని పరిశోధనల్లో కూడా తేలింది. కొన్ని ప్రాంతాల్లో పెరిగిన కాలుష్యం వల్ల దోమలు విపరీతంగా ఉంటాయి. అలాంటి చోట దోమలు ఇళ్ళల్లోకి రాకుండా ఉండాలంటే ఒక గిన్నెలో నీళ్ళు పోసి అందులో ఉల్లి తొక్కలను వేసి కిటికీలు, గుమ్మాల దగ్గర ఉంచితే దోమలు పారిపోతాయి. ఏది ఏమైనా ఉల్లిపాయలు వంటల్లోనే కాక వాటి తొక్కలు కూడా ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి.

Admin

Recent Posts