హెల్త్ టిప్స్

Pearl Millets : రోజూ రాత్రి అన్నంకు బ‌దులుగా వీటిని తినండి.. ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు..!

Pearl Millets : చిరుధాన్యాలలో ఒకటైన సజ్జలను పురాతన కాలం నుండి వాడుతున్నారు. అయితే ఇప్పుడు మారిన పరిస్థితుల కారణంగా మనలో చాలా మంది చిరుధాన్యాల వైపు చూస్తున్నారు. సజ్జలను రోజూ తీసుకుంటే ఎన్నో ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి మంచి ప్రయోజనం కలిగిస్తాయి. సజ్జలలో ఉండే కార్బొహైడ్రేడ్స్ నిదానంగా జీర్ణం అయ్యి రక్తంలో స్థిరమైన చక్కెర స్థాయిలను నిర్వహించడంలో సహాయపడతాయి. దీంతో షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. అలాగే వీటిలో ఉండే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ ని తొలగిస్తుంది. పొటాషియం రక్త ప్రవాహం బాగా జ‌రిగేలా చేసి రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేసి గుండె ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది.

సజ్జలలో ఐరన్ సమృద్దిగా ఉండ‌డం వలన రక్తహీనత సమస్య లేకుండా చేయడ‌మే కాకుండా అలసట, నీరసం, నిస్స‌త్తువ వంటివి లేకుండా చేసి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మలబద్దకం సమస్యతో బాధపడుతున్న వారికి మంచి ఆహారం అని చెప్పవచ్చు. ఫైబర్ సమృద్దిగా ఉండ‌డం వలన గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యలు అసలు ఉండవు.

many wonderful health benefits of pearl millets

యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండడం వలన వయస్సు పెరిగే కొద్దీ వచ్చే అల్జీమర్స్ వ్యాధి, పార్కిన్సన్స్ వ్యాధి వంటి వాటిని నయం చేయడంలో సహాయపడతాయి. బరువు తగ్గాలని ప్రణాళికలో ఉన్నవారికి మంచి ఆహార ఎంపిక అని చెప్పవచ్చు. సజ్జలలో ఉండే ఫాస్ఫరస్ ఎముకలను బలంగా చేస్తుంది. ఇలా స‌జ్జ‌ల‌తో మ‌నం ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. క‌నుక వీటిని రోజూ తినాలి.

Admin

Recent Posts