నిత్యం మనం అనేక రకాల పనులను శారీరకంగా చేస్తుంటాం. కానీ మానసికంగా చేసే పనులకు మెదడు యాక్టివ్‌గా ఉండాలి. మెదడు చురుగ్గా పనిచేయాలి. దీనికి తోడు జ్ఞాపకశక్తి కూడా ఉండాలి. దీంతో మైండ్‌తోనూ మనం చురుగ్గా పనిచేయగలుగుతాం. కనుక మెదడు యాక్టివ్‌గా ఉండాలన్నా, జ్ఞాపకశక్తి పెరగాలన్నా అందుకు కింద తెలిపిన ఆహారాలను తరచూ తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఆ ఆహారాలు ఏమిటంటే…
వాల్ నట్స్, బాదంపప్పు, నలుపు రంగు కిస్మిస్, జీడిపప్పు వంటి ఆహారాలను తినడం వల్ల మనకు ఆరోగ్యకరమైన కొవ్వులు అందుతాయి. ఫలితంగా మెదడు చురుగ్గా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
అవిసె గింజలు, చియా సీడ్స్, పొద్దు తిరుగుడు విత్తనాలు, గుమ్మడికాయ విత్తనాలను తినడం వల్ల కూడా ఆరోగ్యకరమై కొవ్వులు అందుతాయి. ముఖ్యంగా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్స్, మినరల్స్ లభిస్తాయి. ఇవి మెదడును యాక్టివ్‌గా మారుస్తాయి.
నెయ్యిలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి మెదడును యాక్టివ్‌గా ఉంచుతాయి. జ్ఞాపకశక్తి పెరిగేందుకు సహకరిస్తాయి. అందువల్ల రోజూ ఆహారంలో నెయ్యిని భాగం చేసుకోవాలి.
కాఫీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, కెఫీన్ మెదడును అలర్ట్‌గా ఉంచుతాయి. దీంతో జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. రోజుకు కనీసం రెండు కప్పుల కాఫీని తాగుతుంటే ఫలితం ఉంటుంది.
మెదడును యాక్టివ్‌గా ఉంచడంలో పసుపు కూడా ఎంతగానో పనిచేస్తుంది. ఇది జ్ఞాపకశక్తి, ఏకాగ్రతలను పెంచుతుంది. రోజూ రాత్రి పాలలో పసుపు కలుపుకుని తాగితే ఎంతగానో మేలు చేస్తుంది.
పాల నుంచి తయారు చేసే పనీర్‌లోనూ ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇందులో ఉండే పోషకాలు మెదడును యాక్టివ్‌గా ఉంచుతాయి. జ్ఞాపకశక్తి పెరిగేందుకు సహకరిస్తాయి.
తృణ ధాన్యాలలో బి విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. మెదడు పనితీరును మెరుగు పరుస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి.
తాజా పండ్లు, ఆకు కూరలు, కూరగాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందువల్ల వీటిని రోజూ తీసుకుంటే మెదడు యాక్టివ్‌గా ఉంటుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతుంది.
పైన తెలిపిన ఆహారాలన్నింటినీ నిత్యం తీసుకోవచ్చు. అవన్నీ మెదడు పనితీరును మెరుగు పరుస్తాయి. మెదడును యాక్టివ్‌గా ఉండేలా చేస్తాయి. దీంతో మనం చేసే పనిమీద ధ్యాస పెరుగుతుంది. ఏకాగ్రతగా పని పూర్తి చేయవచ్చు. అలాగే జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. అయితే దీంతోపాటు వీలైనంత వరకు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. యోగా, ధ్యానం వంటివి చేయడం వల్ల కూడా మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. దీంతో మెదడు యాక్టివ్‌గా పనిచేస్తుంది. మైండ్‌తో చేసే పనులను సునాయాసంగా చేయవచ్చు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365