హెల్త్ టిప్స్

పురుషులు ఈ సూచ‌న‌లు పాటిస్తే లైంగిక శ‌క్తిని సుల‌భంగా పెంచుకోవ‌చ్చు..

ప్రస్తుత యువతరంలో లైంగిక సమస్యలు అధికంగా ఉంటున్నాయి. అందుకు వారి జీవనశైలితో పాటు వారి అలవాట్లు కూడా ప్రధాన కారణమని వైద్య నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుత యువతలో లైంగిక స్టామినా తగ్గడానికి వారి రోజు వారి అలవాట్లే కారణమని, ఈ సమస్య ఈ తరం యువతలో రోజు రోజుకు అధికం అవుతుందని నిపుణులు అంటున్నారు. అయితే తమ అలవాట్లను కాస్తంత మార్చుకుంటే ఈ సమస్యను అధిగమించొచ్చని చెప్తున్నారు. ప్రస్తుతం యువతలో నిద్రలేమి అధికంగానే ఉంటుంది. పని భారం వల్లనో మరే ఇతర కారణాల వల్లనో శరీరానికి కావాల్సిన విశ్రాంతిని ఇవ్వలేకపోతున్నారు. నిద్ర తగ్గితే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. వాటిలో భాగంగానే పురుషుల్లో లైంగిక స్టామినా కూడా తగ్గిపోతుందని వైద్యులు అంటున్నారు. ప్రతి రోజూ శరీరానికి సరిపడా నిద్రను అందించడం ద్వారా మన ఆరోగ్యాన్ని తిరిగి గాడిన పెట్టొచ్చని, లైంగిక ఆరోగ్యం కూడా పెరుగుతుందని అంటున్నారు.

ఈ తరం యువతలో చాలా వరకు అందరికీ మద్యం, ధూమపాన అలవాటు ఉంటుంది. ఈ రెండింటిలో ఏ ఒక్క అలవాటు ఉన్నా అది వారి లైంగిక స్టామినాపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్తున్నారు. మద్యం, ధూమపానం వల్ల సాధారణంగా మన పూర్త స్టామినా తగ్గుతుందని, అందులో భాగంగానే లైంగిక స్టామినా కూడా తీవ్రంగా క్షీణిస్తుందని చెప్తున్నారు. ఈ అలవాటు ఉన్నవారు.. దీనిని ఒక్కసారిగా మానేయడం కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని, కాబట్టి వీటిని మెల్లిగా వదులుకోవాలని సూచిస్తున్నారు. శరీరంలో నీటి శాతం తగ్గడం కూడా లైంగికక స్టామినాపై ప్రభావం చూపుతుంది. ప్రతి రోజూ తగినంత నీరు తాగకపోవడం వల్ల మన శరీరం డీహైడ్రేషన్‌కు లోనవుతుందని, ఇది కూడా పురుషుల్లో లైంగిక స్టామినాను తీవ్రంగా తగ్గిస్తుందని వైద్యులు వివరిస్తున్నారు. కాబట్టి ప్రతి రోజూ కూడా శరీరానికి తగ్గ నీరు తాగడం తప్పనిసరి అని అంటున్నారు.

men must follow these to increase sexual stamina

ఈ తరం పురుషులు వర్క్ లోడ్ వల్లో అలవాటులో పొరపాటుగానో రోజులో ఈజీగా మూడు నాలుగు సార్లు కాఫీ, టీలు తాగేస్తుంటారు. ఈ టీలు, కాఫీలు శరీరానికి కావాల్సిన శక్తిని అప్పటికప్పుడు ఇచ్చినప్పటికీ ఇది మన శరీర ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. నిద్రలేమికి దారి తీయడమే కాకుండా స్టామినాను తగ్గిచ్చేస్తుంది. కాబట్టి వీలైనంత వరకు కెఫిన్ తక్కువగా తీసుకునేలా చూసుకోవాలి. రోజంతా పని చేసి అలసిపోయి ఇంటికొచ్చిన తర్వాత వ్యాయామం చేయాలన్న ఆలోచన కూడా రాదు. ఒకవేళ చేద్దామనుకున్నా శరీరం అలసిపోయి అందుకు ఏమాత్రం సహకరించదు. కానీ అలా వ్యాయామం చేయకుండా ఉండటంం కూడా మన శరీరాన్ని స్టామినాను క్షీణింపజేస్తుంది. శరీరానికి కావాల్సిన వ్యాయామం లేకపోయినా పురుషుల్లో లైంగిక స్టామినా పడిపోతుంది.

వీటన్నింటితో పాటుగా ఆహార అలవాట్లలో కూడా మార్పులు చేయడం ద్వారా లైంగిక స్టామినాను అధికం చేసుకోవచ్చని వైద్యులు అంటున్నారు. ప్రతి రోజూ ఫ్రూట్ జ్యూస్‌లు, వెజిటేబుల్ జ్యూస్‌లు తాగడం మేలు చేస్తుందని చెప్తున్నారు. ఫలానా జ్యూసే తాగాలని ఏమీ లేదని, ప్రతి రోజూ ఏదో ఒక జ్యూస్ తాగినా మన ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు వివరిస్తున్నారు.

Admin

Recent Posts