Millet Flour For Diabetes : ప్రస్తుత కాలంలో డయాబెటిస్ అన్నది ప్రపంచ సమస్యగా మారింది. ఒకప్పుడు కేవలం వయస్సు పైబడిన వారికి మాత్రమే షుగర్ వచ్చేది. కానీ ఇప్పుడు అనేక మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. చిన్న వయస్సులో ఉన్నవారికి కూడా డయాబెటిస్ వస్తోంది. అందుకు అస్తవ్యస్తమైన జీవన విధానమే ప్రధాన కారణమని చెప్పవచ్చు. ఇలా జరుగుతుండడం వల్ల వారి వంశంలో ముందు తరాల వారికి టైప్ 1 డయాబెటిస్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. కనుక ఎవరైనా సరే డయాబెటిస్ ను పూర్తిగా నియంత్రించాలి. లేదంటే వారి భవిష్యత్ తరాలకు కూడా ప్రమాదం ఉంటుంది. ఇక కింద తెలిపిన కొన్ని ఆహారాలను రోజూ తీసుకుంటే షుగర్‌ను సులభంగా కంట్రోల్ చేయవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మీకు చిరు ధాన్యాలు అంటే ఏమిటో తెలుసు. వాటిల్లో రాగులు, జొన్నలు, సజ్జలు వంటివి ముఖ్యమైనవి. వీటిని పూర్వ కాలంలో మన పెద్దలు తినేవారు. అందుకనే వారికి వయస్సు మీద పడినా ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చేవి కావు. అయితే వీటిని తీసుకోవడం వల్ల షుగర్ మొత్తం కంట్రోల్ అవుతుంది. వీటిని నేరుగా వండుకుని తినవచ్చు. లేదా పిండి చేసి రొట్టె రూపంలో తినవచ్చు. లేదా జావ, సూప్ తయారు చేసుకుని తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా సరే.. షుగర్ కంట్రోల్ అవుతుంది. రోజులో 2 పూటలు ఈ ఆహారాలను మాత్రమే తీసుకోవాలి. దీంతో షుగర్ ఆటోమేటిగ్గా అదుపులోకి వస్తుంది. వీటిల్లో పిండి పదార్థాలు తక్కువగా, పోషకాలు, ఫైబర్ అధికంగా ఉంటాయి. అందువల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది.
ఇక వీటితోపాటు బార్లీ, ఓట్స్ వంటి తృణ ధాన్యాలను కూడా రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. రోజుకు 2 పూటల పాటు చిరు ధాన్యాలను, ఒక పూట తృణ ధాన్యాలను తినాలి. ఇలా తింటే షుగర్ చాలా త్వరగా అదుపులోకి వస్తుంది. బార్లీ వంటి వాటిని జావలాగా చేసుకుని తీసుకోవచ్చు. అలాగే ఓట్స్‌ను ఉప్మా లాగా వండుకుని తినవచ్చు. దీంతో పోషకాలు లభించడమే కాదు.. షుగర్ లెవల్స్ కూడా తగ్గుతాయి. ఇలా ఈ ఆహారాలను రోజూ తీసుకుంటే షుగర్ దెబ్బకు కంట్రోల్ అవుతుంది. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా కూడా ఉంటారు.