Mosambi Juice : విటమిన్ సి ఎక్కువగా ఉండే వివిధ రకాల పండ్లల్లో మోసంబి కూడా ఒకటి. వీటిని జ్యూస్ గా చేసి తీసుకుంటూ ఉంటాము. మోసంబి జ్యూస్ పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ జ్యూస్ ను ఇష్టంగా తాగుతారు. మనకు జ్యూస్ సెంటర్లలల్లో కూడా మోసంబి జ్యూస్ చాలా సులభంగా లభిస్తుంది. ఇతర పండ్ల రసాలను తాగినట్టుగా మోసంబి జ్యూస్ ను కూడా తప్పకుండా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శీతాకాలంలో తప్పకుండా తీసుకోవాలని వారు చెబుతున్నారు. మోసంబిలో విటమిన్ సి తో పాటు అనేక రకాల విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఈ పండ్లతో చేసిన జ్యూస్ ను తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. శీతాకాలంలో మనలో చాలా మంది దగ్గు, జలుబు వంటి ఇన్పెక్షన్ ల బారిన పడుతూ ఉంటారు.
కనుక ఈ సమయంలో మోసంబిజ్యూస్ ను తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మనం ఇన్పెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము. అంతేకాకుండా శీతాకాలంలో చాలా మలబద్దకం వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాగే చాలా మందికి ఎక్కువగా ఏది కూడా తినాలనిపించదు. అలాంటి వారు మోసంబి జ్యూస్ ను తీసుకోవడం వల్ల పొట్టలో కదలికలు పెరుగుతాయి. మలబద్దకం సమస్య తగ్గుతుంది. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అలాగే ఈ జ్యూస్ ను తాగడం వల్ల నోట్లో ఉండే రుచి మొగ్గలు ఉత్తేజానికి గురి అవుతాయి. దీంతో నోటికి ఏదైనా తినాలన కోరిక కలుగుతుంది. అలాగే ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల వాంతులు, వికారం, విరోచనాలు వంటి సమస్యలు తగ్గుతాయి. మోసంబి జ్యూస్ ను తాగడం వల్ల రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది.
గుండె సమస్యలు దరి చేరకుండ ఉంటాయి. చాలా మంది పంచదార ఎక్కువగా ఉండే శీతల పానీయాలను తీసుకుంటూ ఉంటారు. అలాంటి వారు శీతల పానీయాలకు బదులుగా మోసంబి జ్యూస్ ను తీసుకోవడం మంచి ఫలితం ఉంటుంది. ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల శరీరం డీహ్రైడేషన్ కు గురి కాకుండా ఉంటుంది. శరీరంలో మలినాలు తొలగిపోతాయి. మూత్రపిండాల్లో రాళ్ల సమస్య తగ్గుతుంది. జుట్టును మరియు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, ఎముకలను ధృడంగా ఉంచడంలో, బరువు తగ్గడంలో కూడా మోసంబి జ్యూస్ మనకు సహాయపడుతుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ విధంగా మోసంబి జ్యూస్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని దీనిని ప్రతి ఒక్కరు శీతాకాలంలో తీసుకునే ప్రయత్నం చేయాలని అప్పుడే వాతావరణ మార్పుల కారణంగా కలిగే అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటామని నిపుణులు చెబుతున్నారు.