శ్వాస తీసుకునేటప్పుడు మనం ముక్కు నుంచి, నోటి నుంచి రెండు విధాలుగా తీసుకుంటామన్న విషయం మనకు తెలుసు. అయితే, నోటి నుంచి శ్వాస తీసుకోవడం మంచిదా..? లేదంటే ముక్కు నుంచి తీసుకోవడం మంచిదా..? సరైన సమాధానం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. నోటి ద్వారా శ్వాస తీసుకోవడం వలన ఏమైనా సమస్యలు వస్తాయా అని చాలా మందికి సందేహం ఉంటుంది. ఆయుర్వేద అలాగే ఎనోటోమి ప్రకారం చూసినట్లయితే, నోరు అలాగే ముక్కు రెండు కూడా రెండు రకాల ఫంక్షన్స్ కోసం డిజైన్ చేయబడ్డాయి. ఈ రెండు కాంబినేషన్స్ కూడా ముఖ్యమైన పాత్ర వహిస్తాయి.
ముక్కు ద్వారా మనం ఆక్సిజన్ ని తీసుకుంటాము. దీంతో బాడీలో ఉన్న సెల్స్ కి ఆక్సిజన్ అందుతుంది. నోటి ద్వారా ఆహారాన్ని తీసుకుంటాము. ముక్కు క్రిములు వంటి వాటిని లోపలికి వెళ్లకుండా ఫిల్టర్ చేస్తుంది. నోరు ఆహారాన్ని కడుపులోకి పంపిస్తుంది.
ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటే ఏమవుతుంది..?, నోటి ద్వారా శ్వాస తీసుకుంటే ఏమవుతుంది అనేది చూస్తే.. గ్యాస్ట్రో ఈసోఫిగల్ రిఫ్లెక్స్ సమస్యను ఎదుర్కోవాలి. ఎసిడిటీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. నోటి ద్వారా కాకుండా ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని కొన్ని సార్లు జలుబు, దగ్గు, ముక్కు పట్టేయడం వలన నోటి ద్వారా శ్వాస తీసుకుంటూ ఉంటాం. కానీ, సరిగ్గా పరిస్థితులు ఉన్నప్పుడు ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం మంచిది.