Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Muscle Gain Foods : రాత్రి పూట ఈ ఆహారాల‌ను తినండి.. నెల రోజుల్లోనే కండ ప‌డుతుంది.. పుష్టిగా మారుతారు..!

D by D
October 12, 2023
in వార్త‌లు, హెల్త్ టిప్స్
0
Share on FacebookShare on Twitter

Muscle Gain Foods : అధిక బ‌రువు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారితో పాటు మ‌న‌లో చాలా మంది బ‌రువు త‌క్కువ‌గా ఉన్నామ‌ని కూడా బాధ‌ప‌డుతూ ఉంటారు. ఉండాల్సిన బ‌రువు కంటే త‌క్కువ బ‌రువు ఉండ‌డం కూడా మంచిది కాదు. బ‌రువు త‌క్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల కూడా వివిధ అనారోగ్య స‌మ‌స్య‌లు మ‌న‌ల్ని చుట్టుముడ‌తాయి. క‌నుక మ‌నం మ‌న వ‌య‌సుకు త‌గ్గినట్టు ఉండాల్సినంత బ‌రువు ఉండాలి. చాలా మంది బ‌రువు పెర‌గ‌డానికి అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. మార్కెట్ లో ల‌భించే వివిధ ర‌కాల పొడుల‌ను వాడుతూ ఉంటారు. అలాగే బ‌రువు త్వ‌ర‌గా పెర‌గాల‌నే ఉద్దేశ్యంతో జంక్ ఫుడ్ ను ఎక్కువ‌గా తీసుకుంటూ ఉంటారు. అయితే జంక్ ఫుడ్ ను తీసుకోవ‌డం వ‌ల్ల బ‌రువు పెరిగిన‌ప్ప‌టికి మ‌న ఆరోగ్యానికి హాని క‌లుగుతుంది. జంక్ ఫుడ్ ను తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. గుండె ఆరోగ్యం దెబ్బ‌తింటుంది.

షుగ‌ర్, బీపీ వంటి దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డే అవ‌కాశం కూడా ఉంది. క‌నుక మ‌నం పోష‌కాలు క‌లిగిన సరైన ఆహారాన్ని తీసుకుని బ‌రువు పెర‌గ‌డం మంచిద‌ని నిపుణులు చెబుతున్నారు. అయితే బ‌రువు పెర‌గాల‌నుకునే వారు రాత్రి పూట ఈ ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల సుల‌భంగా, ఆరోగ్యంగా బ‌రువు పెర‌గ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌ను, ఆరోగ్యాన్ని పొంద‌డంతో పాటు బ‌రువు కూడా పెర‌గ‌వ‌చ్చ‌ని వారు చెబుతున్నారు. బ‌రువు పెర‌గ‌డం క‌సం రాత్రి పూట తీసుకోవాల్సిన ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బ‌రువు పెర‌గాల‌నుకునే వారు రాత్రిపూట ఎక్కువ‌గా మాంసాన్ని, చేప‌ల‌ను తీసుకోవాలి. చేప‌ల‌ల్లో ఒమెగా 3 ప్యాటీ యాసిడ్లు, క్యాల‌రీలు, ప్రోటీన్స్ వంటి పోష‌కాలు ఎక్కువ‌గా ఉంటాయి. ఆరోగ్యంగా బరువు పెర‌గాల‌నుకునే వారికి ఇవి చ‌క్క‌టి ఆహారం.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026
Muscle Gain Foods take these at night
Muscle Gain Foods

అలాగే మాంసంలో ఉండే ప్రోటీన్స్, కొవ్వులు కండ పుష్టిని క‌లిగించ‌డంలో, బ‌రువు పెరిగేలా చేయ‌డంలో దోహ‌ద‌ప‌డ‌తాయి. అదే విధంగా బ‌రువు పెర‌గాల‌నుకునే వారు రాత్రిపూట అన్నాన్ని ఎక్కువ‌గా తీసుకోవాలి. దీనిలో అధికంగా ఉండే కార్బోహైడ్రేట్స్, క్యాల‌రీలు బ‌రువు పెర‌గ‌డంలో దోహ‌ద‌ప‌డ‌తాయి. అయితే తెల్ల‌బియ్యంతో వండిన అన్నాన్నికి బ‌దులుగా బ్రౌన్ రైస్, రెడ్ రైస్ తో వండిన అన్నాన్ని తీసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించాలి. అలాగే రాత్రి పూట భోజ‌నంలో మంచి కొవ్వులు, క్యాల‌రీలు ఉండే బాదంప‌ప్పు, ప‌ల్లీలు వంటి ఆహారాల‌ను తీసుకోవాలి. వీటిని తీసుకోవ‌డం వల్ల బ‌రువు పెర‌గ‌డంతో పాటు ఇత‌ర పోష‌కాలు కూడా అందుతాయి. ఇక వీటితో పాటు రాత్రిపూట బంగాళాదుంప‌ల‌ను తీసుకునే ప్ర‌య‌త్నం కూడా చేయాలి. వీటిలో పిండి ప‌దార్థాలు, క్యాల‌రీలు ఎక్కువ‌గా ఉండ‌డంతో పాటు ఇవి సుల‌భంగా జీర్ణ‌మ‌వుతాయి.

దీంతో ఆక‌లి త్వ‌ర‌గా వేస్తుంది. ఫ‌లితంగా మ‌నం ఎక్కువ‌ ఆహారాన్ని తీసుకుంటాము. బ‌రువు పెర‌గ‌డంలో బంగాళాదుంప ఎంతో మేలు చేస్తుంది. అదే విధంగా మ‌ల్టీ గ్రెయిన్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, మిల్లెట్స్ తో చేసిన బ్రెడ్ వంటి వాటిని తీసుకోవాలి. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం బ‌రువు పెర‌గ‌డంతో పాటు క్యాల్షియం, ఐర‌న్ వంటి పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. ఈ విధంగా ఈ ఆహారాల‌ను రాత్రిపూట తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం సుల‌భంగా బ‌రువు పెరుగుతామ‌ని నిపుణులు చెబుతున్నారు. బ‌రువు పెర‌గాల‌నుకునే వారు పిండి ప‌దార్థాలు, ప్రోటీన్, మంచి కొవ్వులు ఉండే ఆహారాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల బ‌రువు పెర‌గ‌డంతో పాటు ఆరోగ్యానికి హాని క‌ల‌గ‌కుండా ఉంటుంద‌ని నిపుణులు సూచిస్తున్నారు.

Tags: Muscle Gain Foods
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Amritsar Halwa : అమృత‌స‌ర్ హ‌ల్వాను ఇలా చేయండి.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.