Nail Biting : చాలా మందికి నోటితో గోళ్ళని కొరికే అలవాటు ఉంటుంది. పిల్లలే కాదు. పెద్దలు కూడా కొరుకుతూ ఉంటారు. ఏదో ఆలోచిస్తూ గోళ్లు కొరకడం, బోర్ కొట్టినప్పుడు, భయం వేసినప్పుడు ఇలా కొన్ని సందర్భాలలో గోళ్ళని ఎక్కువగా కొరుకుతూ ఉంటారు. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చేత గోళ్ళని కొరుకుతూ ఉంటారు. ఒక థియరీ ప్రకారం, ఎమోషన్స్ ని బట్టి గోళ్ళని కొరకడం జరుగుతుందని తెలిసింది.
అమెరికన్ డెంటల్ అసోసియేషన్ ప్రకారం ఓ ఆసక్తికరమైన విషయం బయటకి వచ్చింది. అమెరికన్ డెంటల్ అసోసియేషన్ గోళ్లు కొరకడం వలన పళ్ళు పాడవుతాయని చెప్తోంది. ఒకవేళ కనుక పళ్ళకి బ్రేసెస్ ఉన్నవాళ్లు, గోళ్ళని కొరికితే, పంటిని కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. గోళ్ళని కొరకడం వలన అనేక ఇబ్బందులు కలుగుతాయి. తలనొప్పి, ఫేషియల్ పెయిన్, పళ్ళ సెన్సిటివిటీ, పళ్ళు ఊడిపోవడం వస్తాయి.
ఇలా పంటి డామేజ్ మాత్రమే కాకుండా గోళ్ళని కొరకడం వలన బ్యాక్టీరియా పెరిగి మరిన్ని ప్రమాదాలని కలిగిస్తుంది. బ్యాక్టీరియా వలన గ్యాస్ట్రో ఇంటస్టినల్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. పళ్ళని కొరకడం వలన గోళ్లు ఎర్రగా అయిపోవడం, వాపు కలగడం, చీము పట్టడం లాంటివి కూడా కలుగుతాయి.
ఎక్కువగా చిన్నారులు, టీనేజర్స్, గోళ్ళని కొరుకుతూ ఉంటారు. ఈ అలవాటుకి దూరంగా ఉండాలంటే, గోళ్ళని ఎప్పటికప్పుడు నెయిల్ కట్టర్ తో, చిన్నగా కట్ చేసుకుంటూ ఉండండి. గోళ్ళని కొరికే అలవాటుకి బదులుగా మీరు ఓ స్ట్రెస్ బాల్ ని వాడడం వంటివి చేయండి. అలానే ఈ అలవాటు నుండి బయట పడాలంటే చేదుగా ఉండే నెయిల్ పాలిష్ ని గోళ్ళకి పెట్టుకుంటే గోళ్ళని నోట్లో పెట్టుకోవడానికి చికాకుగా ఉంటుంది. ఇలా వీటి ద్వారా గోళ్ళని కొరికే అలవాటు నుండి బయట పడొచ్చు.