Papaya On Empty Stomach : మనం ఆహారంగా తీసుకోదగిన రుచికరమైన పండ్లల్లో బొప్పాయి పండు కూడా ఒకటి. బొప్పాయి పండు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది వీటిని ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ పండు మనకు అన్ని వేళలా లభిస్తుంది. బొప్పాయి పండులో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు, విటమిన్స్, ఫైబర్, మినరల్స్ ఉన్నాయి. బొప్పాయి పండును తీసుకోవడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే ఈ పండును పరగడుపున తీసుకోవడం వల్ల మనం మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఖాళీ కడుపున బొప్పాయి పండును తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బొప్పాయి పండులో సహజ చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల మనకు శక్తి లభిస్తుంది. ఖాళీ కడుపుతో బొప్పాయి పండును తీసుకోవడం వల్ల మనం రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతాము. నీరసం, బలహీనత మన దరి చేరకుండా ఉంటాయి. బొప్పాయి పండులో విటమిన్ ఎ, సి వంటి పోషకాలు ఉంటాయి. ఇవి కొల్లాజెన్ ఉత్పత్తి అయ్యేలా చేయడంలో సహాయపడతాయి. దీంతో చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. చర్మం ముడతలు పడకుండా ఉంటుంది. బొప్పాయి పండును తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంటువ్యాధులు, ఇన్పెక్షన్ లు రాకుండా ఉంటాయి.

అలాగే ఈ పండులో ఫైబర్ ఎక్కువగా క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కనుక ఈ పండును తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. చాలా సమయం వరకు ఆకలి వేయకుండా ఉంటుంది. తద్వారా మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. బొప్పాయి పండును తీసుకోవడం వల్ల మెదడు పనితీరుతో పాటు మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఉదయం పూట ఈ పండును తీసుకోవడం వల్ల మన మెదడు రోజంతా చురుకుగా పని చేస్తుంది. అలాగే బొప్పాయి పండులో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. మాక్యులర్ డిజెనరేషన్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. బొప్పాయి పండులో పపైన్ అనే ఎంజైమ్ఉంటుంది.
ఇది మనం తీసుకునే ఆహారంలో ఉండే ప్రోటీన్ లను విచ్చిన్నం చేయడంలో సహాయపడుతుంది. అలాగే బొప్పాయి పండును తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మలబద్దకం వంటి సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. అదేవిధంగా బొప్పాయి పండులో యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ పండును తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే వాపులు, నొప్పులు తగ్గుతాయి. ఆర్థరైటిస్ సమస్యతో బాధపడే వారు బొప్పాయి పండును తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే బొప్పాయి పండులో ఫైబర్, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఈవిధంగా బొప్పాయి పండు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని తప్పకుండా దీనిని ఉదయం పూట తీసుకునే ప్రయత్నం చేయాలని నిపుణులు చెబుతున్నారు.