హెల్త్ టిప్స్

క్వాలిటీ టెస్టులో ఫెయిల్‌ అయిన పారాసిటమాల్‌.. వాడాలా.. వద్దా..?

మనం తరచూ అనేక రకాల ఇంగ్లిష్‌ మెడిసిన్లను వాడుతుంటాం. అయితే మీకు తెలుసా.. వాటిల్లో చాలా వరకు కంపెనీలకు చెందిన మెడిసిన్లు క్వాలిటీ టెస్టుల్లో ఫెయిల్‌ అయ్యాయని..? Central Drugs Standard Control Organization (CDSCO) జరిపిన క్వాలిటీ టెస్టుల్లో మొత్తం 90 రకాల మెడిసిన్లు ఫెయిల్‌ అయ్యాయని తాజాగా నివేదికలను సమర్పించారు. గత నెలలో పలు కంపెనీలకు చెందిన కొన్ని భిన్న రకాల మెడిసిన్లను టెస్టుల కోసం శాంపిల్స్‌ సేకరించారు. ఈ క్రమంలోనే కొన్ని రకాల మెడిసిన్లు క్వాలిటీ టెస్టుల్లో ఫెయిలైనట్లు గుర్తించారు. అయితే ప్రతి నెలా ఈ ప్రక్రియ నిరంతరాయంగా ఎప్పటి నుంచో కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ప్రతి నెలా టెస్టులు చేసి ఏ కంపెనీకి చెందిన ఏయే మందులు క్వాలిటీ టెస్టుల్లో ఫెయిల్‌ అయ్యాయో ఓ లిస్ట్‌ను విడుదల చేస్తారు. ఇక తాజాగా విడుదల చేసిన అలాంటి లిస్ట్‌లో చాలా మంది వాడుతున్న మెడిసిన్లు ఉన్నాయి. ముఖ్యంగా పారాసిటమాల్‌, పాన్‌-డి, గ్లైమిపైరైడ్‌, ఇతర హైబీపీ మెడిసిన్లు కూడా ఉన్నాయి. దీంతో వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది.

గతేడాది కూడా CDSCO పలు మార్లు క్వాలిటీ టెస్టుల్లో ఫెయిల్‌ అయిన మందుల జాబితాను విడుదల చేసింది. అయితే ప్రతిసారి విడుదల చేస్తున్న లిస్టులో పారాసిటమాల్‌ ఉంటుండడం ఆందోళన కలిగిస్తోంది. అంటే ఈ మెడిసిన్‌ ఆరోగ్యానికి మంచిది కాదా..? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే మెడిసిన్లు అసలు టెస్టుల్లో ఎందుకు ఫెయిల్‌ అవుతున్నాయి అన్న వివరాలను ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సి ఉంటుంది. అసలు మెడిసిన్లను ఎలా టెస్ట్‌ చేస్తారు, క్వాలిటీ టెస్టులో ఏమేం చేస్తారు..? అంటే.. క్వాలిటీ టెస్టుల్లో ప్రత్యేకమైన కెమికల్స్‌ను ఉపయోగించి మెడిసిన్ క్వాలిటీ ఎంత ఉందో చెక్‌ చేస్తారు. మెడిసిన్లలో ఫార్మాల్డిహైడ్‌, మిథనాల్‌ వంటి సమ్మేళనాలు అధిక సంఖ్యలో ఉంటే ఆ మెడిసిన్లు క్వాలిటీ టెస్టులో ఫెయిల్‌ అయ్యాయని అర్థం.

paracetamol failed in quality tests can we use it or not

ఇక కొన్ని రకాల మెడిసిన్లలో లవణాలను సరిగ్గా వాడడం లేదని గుర్తించారు. అలాగే కొన్ని రకాల మెడిసిన్లను సరిగ్గా నిల్వ చేయడం లేదని గుర్తించారు. అలాంటప్పుడు బాక్టీరియా ఎంటర్‌ అవుతుంది. దీని తరువాత మెడిసిన్‌ను టెస్ట్‌ చేస్తే కచ్చితంగా అది ఫెయిల్‌ అవుతుంది. అలాంటప్పుడు టెస్ట్‌ చేయబడిన అన్ని రకాల మెడిసిన్లు ఫెయిల్‌ అయినా కూడా అవి హానికరం అని చెప్పలేమని నిపుణులు చెబుతున్నారు. అయితే పారాసిటమాల్‌ను మరి తీసుకోవాలా, వద్దా.. దీని ప్రభావం మన ఆరోగ్యంపై పడుతుందా.. అంటే.. అందుకు డాక్టర్లు ఏమని సమాధానం చెబుతున్నారంటే.. పారాసిటమాల్‌, పాన్‌ డి ట్యాబ్లెట్లను చాలా మంది ఉపయోగిస్తున్నారు. ఇవి క్వాలిటీ టెస్టుల్లోనూ ఫెయిల్‌ అయ్యాయి. అయితే ఇవి మన ఆరోగ్యానికి హానికరం అని చెప్పలేం. ఏదో ఒకటి రెండు కంపెనీలకు చెందిన ట్యాబ్లెట్లే ఇలా జరుగుతున్నాయి. అన్నీ కావడం లేదు. కనుక వినియోగదారులు జనరిక్‌ మెడిసిన్‌ కాకుండా నాణ్యమైన కంపెనీ మందులను వాడితే హాని కలగకుండా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. అలాగే మెడిసిన్లను కొన్నప్పుడు వాటి కంపెనీలకు ఐఎస్‌ఓ లేదా WHO-GMP గుర్తింపు ఉందా, లేదా అని చెక్‌ చేయడం మంచిది. దీంతో నాణ్యమైన మందులను వాడవచ్చు. ఆరోగ్యానికి హాని కలగకుండా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు.

Admin

Recent Posts