Apples : మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉండే పండ్లలో యాపిల్ పండ్లు కూడా ఒకటి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. ముఖ్యంగా జ్వరం వచ్చినప్పుడు వీటిని తింటే త్వరగా కోలుకుంటారు. యాపిల్ పండ్లను తినడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. యాపిల్ పండ్లతో మనకు ఎంతో మేలు జరుగుతుంది. అయితే యాపిల్ పండ్లను తినడంలో చాలా మంది ఒక సందేహాన్ని వ్యక్తం చేస్తుంటారు. అదేమిటంటే..
యాపిల్ పండ్లను తొక్కతో తినాలా.. తొక్క తీసేసి తినాలా.. అని చాలా మందికి ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతూ ఉంటుంది. అయితే ఇందుకు వైద్య నిపుణులు ఏమని సమాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. యాపిల్ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అయితే తొక్కతో ఉన్న యాపిల్ పండ్లలో ఇది ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ మనకు జీర్ణక్రియలకు ఎంతో ఉపయోగపడుతుంది. బరువును తగ్గిస్తుంది. అలాగే తొక్కతో ఉండే యాపిల్ పండ్లలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అలాగే మన శరీరానికి ఉపయోగపడే పలు సమ్మేళనాలు కూడా తొక్కలోనే ఉంటాయి.
ఇక తొక్క తీసిన యాపిల్ పండ్లలో క్రిమి సంహారక అవశేషాలు తక్కువగా ఉంటాయి. అలాగే ఇవి సులభంగా జీర్ణం అవుతాయి. కానీ ఫైబర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు తక్కువగా ఉంటాయి. కనుక తొక్క ఉన్న యాపిల్ పండ్లతోనే మనకు లాభం కలుగుతుందని సులభంగా చెప్పవచ్చు. అయితే యాపిల్ పండ్లను తొక్కతో తినాలా.. తొక్క తీసేసి తినాలా.. అనేది ఎవరికి వారు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరి ఇష్టానికి తగినట్లుగా వారు యాపిల్ పండ్లను తినవచ్చు. కానీ తొక్క ఉంచి యాపిల్ పండ్లను తింటేనే ఎక్కువ పోషకాలు లభిస్తాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇలా యాపిల్ పండ్లను తింటేనే మనకు అధికంగా లాభం కలుగుతుంది. కనుక యాపిల్ పండ్లను తినే విషయంలో ఈ సూచనలను పాటించాల్సి ఉంటుంది. దీంతో వాటి ద్వారా పోషకాలను అధికంగా పొందవచ్చు. అలాగే ఆరోగ్యంగా ఉంటారు.