షుగర్ వ్యాధి రాకుండా జీవనశైలిని మార్చుకుంటూ వీలైనంత జాగ్రత్త పడాలి. తినే ఆహారాలు ఆరోగ్యకరమైనవై వుండాలి. అధిక కొవ్వు, ఉప్పు, లేదా మితిమించిన తీపి శరీరానికి హాని చేస్తాయి. డయాబెటీస్ వంశానుగతంగా కూడా రావచ్చు. అయితే, ఆహారం ప్రధానంగా ఈ వ్యాధిని తెప్పిస్తుందనే చెప్పాలి. షుగర్ వ్యాధి రోగులు, కార్బోహైడ్రేట్లు వున్న ఆహారం తీసుకోరాదు.
షుగర్, బంగాళదుంపలు, బ్రెడ్, తెల్లటి బియ్యం, మొదలైనవి అధిక కార్బో హైడ్రేట్లు కలిగి వుంటాయి. వీటి గ్లూకోజ్ ఒకసారి రక్తంలోకి పీల్చబడితే, దీనికి తగిన ఇన్సులిన్ ఉత్పత్తి వుండాలి. డయాబెటిక్ రోగులలో ఇది లోపిస్తుంది. కేకులు, కేండీలు, చాక్లెట్ లు ఇతర తీపి వస్తువులు తినకండి. కూల్ డ్రింక్ లు, సోడాలు కూడా హాని కలిగిస్తాయి.
ఫాస్ట్ ఫుడ్ గా వస్తున్న చిరుతిండ్లు షుగర్ వ్యాధి రోగులకు మరింత హాని చేస్తాయి. వీరు తినే ఆహారపుటలవాట్లను మార్చుకోవాలి. పండ్లు, కూరగాయలు, పండ్ల రసాలు, వంటివి వీరికి ప్రత్యామ్నాయ ఆహారంగా వుండాలి. వీటివలన మన శరీరంలోకి చేరే కేలరీలు తక్కువగా వుండటమే కాక, శరీరానికి అవసరమైన శక్తి చేకూరుతుంది.