ప్రస్తుత తరుణంలో స్మార్ట్ ఫోన్ల వల్ల ఎన్ని అద్భుతమైన ఉపయోగాలు కలుగుతున్నాయో అందరికీ తెలిసిందే. ఫోన్ల వల్ల మనం అనేక పనులను నిమిషాల్లోనే చక్కబెట్టుకోగలుగుతున్నాం. వాటితో ప్రపంచంలో ఎక్కడ ఉన్న వ్యక్తికైనా ఏకంగా వీడియో కాల్ చేసి మాట్లాడగలుగుతున్నాం. దీంతోపాటు అనేక ఇతర పనులకు కూడా వాటిని ఉపయోగిస్తున్నాం. దీంతో అవి మన దైనందిన జీవితంలో ఒక భాగం అయ్యాయి. వాటిని విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండలేని పరిస్థితి నెలకొంది.
అయితే మొబైల్ ఫోన్లను సాధారణంగా రోజులో ఎప్పుడైనా వాడుతారు. కానీ కొందరు మాత్రం టాయిలెట్‌కు వెళ్లినప్పుడు కూడా మల విసర్జన చేస్తూ దాన్ని ఉపయోగిస్తుంటారు. కానీ నిజానికి అలా చేయరాదు. దాని వల్ల పలు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
* టాయిలెట్ లోకి మొబైల్ ను తీసుకుపోవడం వల్ల ఎక్కువ సేపు అందులో గడుపుతారు. దీనివల్ల ఎక్కువసేపు మల విసర్జన చేస్తూ కూర్చుంటారు. ఈ క్రమంలో శరీరంలో ఆ భాగాలలో ఒత్తిడి ఏర్పడుతుంది. ఫలితంగా అది పైల్స్ కు, ఇతర సమస్యలకు దారి తీసే అవకాశం ఉంటుంది. కనుక టాయిలెట్లలో ఫోన్లను వాడరాదు.
* టాయిలెట్ లో సహజంగానే సూక్ష్మ క్రిములు ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలో టాయిలెట్ లో ఫోన్‌ను వాడితే ఆ సూక్ష్మ క్రిములు ఫోన్లపైకి చేరుతాయి. తరువాత అవి మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఇన్ఫెక్షన్లు, వ్యాధులు వస్తాయి. కనుక టాయిలెట్లలో ఫోన్లను ఉపయోగించడం మానేయాలి.
* ఫోన్లను టాయిలెట్లలో ఉపయోగించడం వల్ల సహజంగానే అవసరం అయిన దానికన్నా ఎక్కువ సమయం పాటు టాయిలెట్‌లో గడుపుతారు. దీంతో ఉదయాన్నే ఎంతో విలువైన సమయం వృథా అవుతుంది.
* టాయిలెట్లలో ఫోన్లను వాడడం వల్ల చెడు అలవాట్లకు బానిసలయ్యే అవకాశం ఉంటుదని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అలా చేయడం మనల్ని తప్పుదోవ పట్టిస్తుంది.
కనుక ఇకపై టాయిలెట్‌కు వెళితే ఎవరైనా సరే ఫోన్లను వాడకండి..!