Piles Home Remedies : మనలో చాలా మంది మొలల సమస్యతో కూడా బాధపడుతూ ఉంటారు. వయసుతో సంబంధం లేకుండా ఇవి అందరిని వేధిస్తూ ఉంటాయి. వీటి వల్ల విపరీతమైన నొప్పి, బాధ కలుగుతుంది. మలవిసర్జన సమయంలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. మొలల సమస్య తలెత్తడానికి ప్రధాన కారణం మలబద్దకం. మలబద్దకం కారణంగా ఈ సమస్య తలెత్తుతుంది. మలబద్దకం సమస్యతో బాధపడే వారు మలవిసర్జన సమయంలో మలద్వారంపై ఎక్కువగా ఒత్తిడి చేస్తూ మలవిసర్జన చేయడంలో ఆ భాగంలో ఉండే రక్తనాళాలు చిట్లి రక్తం బయటకు వస్తుంది. ఇలా బయటకు వచ్చిన రక్తం గడ్డకట్టి దానిపై చర్మం ఏర్పడి బుడిపెలుగా తయారవుతుంది. వీటినే మొలలు అంటారు. వీటిలో కూడా బాహ్య మొలలు, అంతర్గత మొలలు అని రెండు రకాలు ఉంటాయి. ఈ మొలల కారణంగా కలిగే బాధ అంతా ఇంతా కాదు.
ఈ సమస్య నుండి బయటపడడానికి వైద్యులు శస్త్రచికిత్సను సూచిస్తూ ఉంటారు. అయితే శస్త్రచికిత్సతో అవసరం లేకుండా సహజ సిద్దంగా కూడా ఈ సమస్య నుండి మనం ఉపశమనాన్ని పొందవచ్చు. ఈ చిట్కాలను పాటించడం వల్ల మొలల వల్ల కలిగే బాధ, నొప్పి తగ్గడంతో పాటు లేని వారికి ఈ సమస్య రాకుండా ఉంటుంది. మొలల సమస్యతో బాధపడే వారికి ఎక్కువగా మలబద్దకం సమస్య ఉంటుంది. వీరిలో మలం గట్టిగా, ఉండలుగా వస్తుంది. ఇలాంటి వారు 8 నుండి 10 రోజుల పాటు వరుసగా ఎనిమా చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల గట్టి పడిన మలం సులభంగా బయటకు పోతుంది. అలాగే రోజూ ఉదయం పరగడుపున లీటర్నర నీటిని తాగాలి. ఒక గంట తరువాత మరలా ఒక లీటర్ నీటిని తాగాలి. ఇలా తాగడం వల్ల రెండు సార్లు మలవిసర్జన జరుగుతుంది. దీంతో మలబద్దకం సమస్య రాకుండా ఉంటుంది.
అలాగే మలవిసర్జన సులభంగా అవ్వడానికి ఎక్కువగా పీచు పదార్థాలు ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఆకుకూరలు, తృణ ధాన్యాలను తీసుకోవాలి. అలాగే కూరగాయలను తొక్కతో వండుకుని తీసుకునేప్రయత్నం చేయాలి. ఇలా చేయడం వల్ల శరీరానికి తగినంత ఫైబర్ లభిస్తుంది. దీంతో మలబద్దకం సమస్య పూర్తిగా తగ్గుతుంది. అలాగే సాయంత్రం సమయంలో పండ్లను తొక్కలతో తీసుకునే ప్రయత్నం చేయాలి. ఇలా చేయడం వల్ల మలబద్దకం తగ్గుతుంది. మొలల సమస్య నుండి చక్కటి ఉపశమనం కలుగుతుంది. లేని వారికి రాకుండా ఉంటుంది.
అలాగే బాహ్యంగా ఉండే మొలల నొప్పితో బాధపడే వారు వస్త్రంలో ఐస్ క్యూబ్స్ వేసి మొలలపై ఉంచాలి. ఇలా చేయడం వల్ల నొప్పి నుండి చక్కటి ఉపశమనం కలుగుతుంది. అలాగే టబ్ బాత్ చేయడం వల్ల మొలల సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే మలం ద్వారం వద్ద మొలలతో పాటు గాయం, రక్తం కారడం వంటి ఇతర సమస్యలతో బాధపడే వారు ఆ భాగంలో గాయాలపై, మొలలపై స్వచ్ఛమైన తేనెను రాయాలి. ఇలా రాయడం వల్ల గాయాలు త్వరగా మానిపోతాయి. ఆ భాగంలో ఉండే క్రిములు నశిస్తాయి. ఈ విధంగా ఈ చిట్కాలను పాటించడం వల్ల మొలల సమస్య తగ్గడంతో పాటు భవిష్యత్తులో కూడా రాకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.