Plastic Water Bottles : ఒక‌సారి వాడిన ప్లాస్టిక్ వాట‌ర్ బాటిల్స్‌ను మ‌ళ్లీ వాడుతున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

Plastic Water Bottles : మ‌నం బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు ఎక్కువ‌గా ప్లాస్టిక్ బాటిల్స్ లో నిల్వ చేసిన నీటిని తాగుతూ ఉంటాం. ఇలా ప్లాస్టిక్ బాటిల్స్ లో నిల్వ చేసిన నీటిని తాగ‌డం వ‌ల్ల మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉండే మైక్రో ప్లాస్టిక్ క‌ణాలు శ‌రీరంపై దీర్ఘ‌కాలం పాటు తీవ్ర‌ ప్ర‌భావాన్ని చూపిస్తాయ‌ని నిపుణులు చెబుతున్నారు. ప్లాస్టిక్ బాటిల్స్ నీటిని తాగ‌డం వ‌ల్ల దాహం త‌గ్గ‌డం కంటే ఇంకా పెరుగుతుంద‌ని వారు చెబుతున్నారు. 5 ఎమ్ ఎమ్ కంటే త‌క్కువ‌గా ఉండే చిన్న ప్లాస్టిక్ క‌ణాలు అంత త్వ‌ర‌గా న‌శించ‌వు. అలాగే ఇవి మ‌న శ‌రీరంలో చాలా కాలం పాటు అలాగే పేరుకుపోయి ఉంటాయి. ఈ ప్ర‌క్రియ‌నే బ‌యో అక్యుమ్యులేష‌న్ అంటారు.

ప్లాస్టిక్ త‌యారీలో త‌యారీలో ఉప‌యోగించిన ర‌సాయ‌నాలు మ‌న‌ల్ని తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డేలా చేస్తాయ‌ని నిపుణులు జ‌రిపిన ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది. అలాగే మ‌నం ప్ర‌తిరోజూ చేసే మ‌ల‌విస‌ర్జ‌న‌లో కూడా ప్లాస్టిక్ క‌ణాలు ఉన్నాయ‌ని మ‌న దైనందిన జీవితంలో మైక్రోప్లాస్టిక్ కూడా ఒక భాగంగా మారింద‌ని వారు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ప్లాస్టిక్ వాట‌ర్ బాటిల్స్ లో బాటిల్ నుండి అలాగే మూత నుండి కూడా 1 ఎమ్ ఎమ్ కంటే త‌క్కువ ప‌రిమాణంలో ఉండే ప్లాస్టిక్ క‌ణాలు విడుద‌ల అవుతున్నాయి. ప్లాస్టిక్ బాటిల్ నుండి విడుద‌ల అయ్యే ప్లాస్టిక్ క‌ణాలు సాధార‌ణంగా ఎటువంటి రంగు ఉండ‌వు. మూత నుండి విడుద‌ల అయ్యే క‌ణాలు నీలం లేదా ఆకుప‌చ్చ రంగుల‌ను క‌లిగి ఉంటాయి.

Plastic Water Bottles are you re using them know what happens
Plastic Water Bottles

పాలిథిలిన్ టెరెఫ్తాలేట్ అనే ప్లాస్టిక్ పాలిమ‌ర్ నుండి ప్లాస్టిక్ బాటిల్ ను అలాగే దాని మూత‌ను త‌యారు చేస్తారు. ర‌వాణా స‌మ‌యంలో క‌లిగే ఒత్తిడి, బాటిల్ ను షేకింగ్ చేయ‌డం, అలాగే అధిక ఒత్తిడితో బాటిల్ లోకి నీటిని నింప‌డం అలాగే వాట‌ర్ బాటిల్స్ ను నిల్వ చేసే ఉష్ణోగ్ర‌త‌లు, అలాగే బాటిల్ మూత‌ను ఎక్కువ‌గా తెర‌వ‌డం, మూయ‌డం వంటి అనేక విష‌యాలు నీటిలో క‌లిసే మైక్రో ప్లాస్టిక్ మోతాదుపై ప్ర‌భావాన్ని చూపిస్తాయి. ఒక‌సారి ఉప‌యోగించిన బాటిల్స్ లో కంటే రీసైకిల్ చేసి పున‌ర్వినియోగించిన ప్లాస్టిక్ బాటిల్స్ లో ఈ మైక్కో ప్లాస్టిక్ క‌ణాలు మ‌రింత ఎక్కువ‌గా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

ప్లాస్టిక్ బాటిల్స్ లో నిల్వ చేసిన నీటిని తాగ‌డం వ‌ల్ల ఈ నీటిలో ఉండే మైక్రో ప్లాస్టిక్ క‌ణాలు ప్రేగులు, జీర్ణాశ‌యం, కాలేయం వంటి వివిధ శ‌రీర భాగాల్లోకి ప్ర‌వేశిస్తాయి. అలాగే ఇవి ర‌క్తం ద్వారా శ‌రీరం మొత్తం ప్ర‌వ‌హిస్తాయి. దీని కార‌ణంగా కాలేయ సంబంధిత స‌మ‌స్య‌లు, ఊపిరితిత్తుల క్యాన్స‌ర్, జీర్ణాశ‌య సంబంధింత స‌మ‌స్య‌లు, ప్రేగుల‌కు సంబంధించిన స‌మ‌స్య‌లు, వివిధ ర‌కాల క్యాన్స‌ర్ ల బారిన ప‌డే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. క‌నుక వీలైనంత వ‌ర‌కు ప్లాస్టిక్ బాటిల్స్ వినియోగాన్ని త‌గ్గించాలి. రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ బాటిల్స్ ను తిరిగి ఉప‌యోగించ‌కూడ‌ద‌ని నిపుణులు సూచిస్తున్నారు.

D

Recent Posts