హెల్త్ టిప్స్

Pregnant Women Diet : గ‌ర్భిణీలు ఈ ఫుడ్స్‌ను అస‌లు తిన‌రాదు..!

Pregnant Women Diet : గ‌ర్భం దాల్చిన మ‌హిళ‌లు ఆహారం విష‌యంలో చాలా జాగ్ర‌త్త వ‌హించాలి. డాక్ట‌ర్ సూచ‌న మేర‌కు ఏయే ఆహార ప‌దార్థాల‌ను తిన‌మ‌ని చెబుతారో వాటినే తినాలి. అంతేకానీ.. తెలిసీ తెలియ‌కుండా ఏది ప‌డిదే ఆ ఆహారాన్ని తిన‌కూడ‌దు. ముఖ్యంగా రెడీ టు ఈట్ ఫుడ్‌ను గ‌ర్భిణీలు అస్స‌లు తిన‌కూడ‌ద‌ట‌. తింటే అనేక దుష్ప‌రిణామాలు ఎదుర‌వుతాయ‌ని సైంటిస్టులు చేప‌ట్టిన ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది. రెడీ టు ఈట్ ఫుడ్‌ను గ‌ర్భిణీలు తింటే పుట్ట‌బోయే పిల్ల‌ల‌పై ఆ ఫుడ్ ప్ర‌భావాన్ని చూపిస్తుంద‌ట‌.

రెడీ టు ఈట్ ఫుడ్ అంటే.. నిల్వ చేసిన ఆహార ప‌దార్థాలు అన్న‌మాట‌. వాటిని వండాల్సిన ప‌ని ఉండ‌దు. నేరుగా తినేయ‌డ‌మే. ప్ర‌స్తుతం మ‌న‌కు మార్కెట్‌లో అనేక ర‌కాల రెడీ టు ఈట్ ఫుడ్ ఐట‌మ్స్ ల‌భిస్తున్నాయి. అయితే వీటికి గ‌ర్భిణీలు ఎంత వీలైతే అంత దూరంగా ఉండాల‌ని వైద్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. రెడీ టు ఈట్ ఫుడ్‌ను గ‌ర్భిణీలు తింటే వారికి పుట్ట‌బోయే పిల్ల‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో పుడతార‌ట‌. అంతేకాకుండా ఆ ఫుడ్ మాన‌వ ప్ర‌త్యుత్ప‌త్తి వ్య‌వ‌స్థ‌పై కూడా ప్ర‌భావం చూపుతుంద‌ని, దీంతో వారికి సంతానం క‌లిగే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయ‌ని సైంటిస్టులు చెబుతున్నారు.

Pregnant Women Diet they should avoid these foods

రెడీ టు ఈట్ ఫుడ్‌ను తిన‌డం వ‌ల్ల గ‌ర్భిణీల‌కు కొన్ని సంద‌ర్భాల్లో అబార్ష‌న్ అయ్యే అవ‌కాశాలు కూడా ఉంటాయ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. అలాగే మ‌హిళ‌ల‌కు పాలిసిస్టిక్ ఒవేరియ‌న్ సిండ్రోమ్ అనే స‌మ‌స్య వ‌స్తుంద‌ని వారు హెచ్చ‌రిస్తున్నారు. క‌నుక గ‌ర్భం దాల్చిన మ‌హిళ‌లు ఆహారం విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. అన్ని ర‌కాల పోష‌కాలు క‌లిగిన పండ్లు, తాజా కూర‌గాయ‌లను బాగా తింటే.. పుట్ట‌బోయే పిల్ల‌లు ఆరోగ్యంగా ఉంటారు..!

Admin

Recent Posts