Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

మ‌హిళ‌లు గ‌ర్భం ధ‌రించిన‌ప్పుడు ఈ 20 ఆహారాల‌కు దూరంగా ఉండాలి..!

Admin by Admin
July 3, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

గర్భధారణ సమయంలో తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆరోగ్యానికి హాని కలిగించే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. సాధారణంగా ఆరోగ్యానికి మంచివి అనిపించే కొన్ని ఆహారాలు కూడా గర్భధారణ సమయంలో హానికరం కావచ్చు. అందువల్ల, గర్భిణీ స్త్రీలు తమ జీవనశైలికి సంబంధించిన ప్రతి విషయం, ముఖ్యంగా ఆహారం గురించి జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సార్లు మీరు తినే ఆహారం కడుపులోకి బిడ్డకు హాని చేయచ్చు. గర్భధారణ సమయంలో తప్పనిసరిగా దూరంగా ఉండవలసిన 20 ఆహార పదార్థాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. గర్భధారణ ప్రారంభ దశలో అనాస తినడం వల్ల గర్భాశయ సంకోచాలు రావచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని తినకండి. ప్రారంభ దశలో మాత్రమే కాకుండా బిడ్డకు జన్మనిచ్చే వరకూ బొప్పాయికి కూడా దూరంగా ఉండటమే మేలు. ఎక్కువ మెంతులు తినడం వల్ల కూడా గర్భాశయ సంకోచాలు ప్రేరేపించబడవచ్చు. కనుక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పటి నుంచి బిడ్డ పుట్టే వరకూ మెంతులకు దూరంగా ఉండటమే మంచిది.

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే కలబంద ప్రెగ్నెన్సీ సమయంలో నిషేధించాల్సిన ఆహారమే. ఎందుకంటే ఇది కూడా గర్భాశయ సంకోచాలను ప్రేరేపిస్తుంది. పచ్చి బొప్పాయి ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు కలిగించేదే అయినప్పటికీ ప్రెగ్నెన్సీ సమయంలో ఇది విషంతో సమానమని పెద్దలు, నిపుణులు చెబుతారు. ఇది గర్భాశయ సంకోచాలకు కారణం కావచ్చు, కాబట్టి గర్భధారణ సమయంలో దీనికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా ప్రారంభ దశలో. పూర్తిగా ఉడకని పుట్టగొడుగులలో బ్యాక్టీరియా ఉండవచ్చు, కాబట్టి వీటిని బాగా ఉడికించిన తర్వాత మాత్రమే తినాలి. వీలైనంత వరకూ గర్భధారణ సమయంలో తినకపోవడమే మంచిది. మలబద్దకం, అజీర్తి వంటి సమస్యలకు వాము చక్కటి పరిష్కారమే అయినప్పటికీ ప్రెగ్నెన్సీ సమయంలో వామును ఎక్కువగా తినడం వల్ల గర్భాశయ ఉద్దీపన కలుగుతుంది. ప్యాక్ చేసిన జ్యూస్ లలో బ్యాక్టీరియా సంక్రమణ ప్రమాదం ఉంటుంది.

pregnant women should keep away from these foods

బ్రీ, ఫెటా వంటి చీజ్‌లలో లిస్టీరియా ఉండవచ్చు. ఇది బిడ్డ ఆరోగ్యానికి హాని చేయచ్చు. కనుక మెత్తటి చీజ్ లకు గర్భధారణ సమయంలో దూరంగా ఉండటమే మంచిది. పచ్చి మొలకలలో E. coli, సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియా ఉండవచ్చు. ప్రెగ్నెన్సీ సమయంలో ఇది తల్లీ బిడ్డా ఆరోగ్యానికి హాని చేస్తుంది. గ్రీన్ టీలో కెఫిన్ ఉంటుంది, కాబట్టి గర్భధారణ సమయంలో దీనిని పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. కొన్ని మూలికలు గర్భాశయ సంకోచాలకు కారణం కావచ్చు. కనుక హెర్బల్ టీలు తాగేటప్పుడు ఆచీతూచీ ఎంచుకోండి. కృత్రిమ తీపి పానీయాలలో అధిక మొత్తంలో చక్కెర, సంకలనాలు ఉంటాయి. ఇవి తల్లితో పాటు బిడ్డ ఆరోగ్యానికి హాని చేసే ప్రమాదముంది. మీకు గ్లూటెన్ అసహనం ఉంటే, సమస్యలను నివారించడానికి దీనికి దూరంగా ఉండండి. జంక్ ఫుడ్‌లో అనారోగ్యకరమైన కొవ్వులు, చక్కెర, సంకలనాలు ఉంటాయి. ప్రెగ్నెన్సీ సమయంలో వీటికి వీలైనంత దూరంగా ఉండమే మంచిది. స్పైసీగా తినాలనిపిస్తే ఇంట్లోనే చేసుకుని మితంగా తినండి.

గర్భధారణ సమయంలో యాసిడ్ రిఫ్లక్స్‌ను నిమ్మ‌కాయ‌ ప్రేరేపిస్తుంది. కనుక నిమ్మకాయను, నిమ్మరసాన్ని ఈ సమయంలో ఎక్కువగా తీసుకోకండి. వెల్లుల్లి జీర్ణ సమస్యలకు కారణం కావచ్చు. ఇది తల్లితో పాటు లోపల ఉన్న బిడ్డకు కూడా ఇబ్బందిని కలిగిస్తుంది. కనుక ప్రెగ్నెన్సీ సమయంలో దీన్ని మితంగా మాత్రమే తీసుకోండి. ఎక్కువగా చింతపండు తినడం వల్ల గర్భాశయ సంకోచాలు రావచ్చు. కనుక అతిగా కాకుండా మితంగా తినేలా ప్లాన్ చేసుకొండి. మిగిలిపోయిన అన్నం, కూర, తీపి పదార్థం వంటి వాటిని గర్భధారణ సమయంలో తినకపోవడమే మంచిది. వీటిని సరిగ్గా సరిగ్గా నిల్వ చేయకపోతే అందులో బ్యాక్టీరియా పెరుగుతాయి, ఇది ఇద్దరి ఆరోగ్యానికి మంచిది కాదు. ఎక్కువగా వేపుళ్ళు తినడం ఆరోగ్యానికి హానికరం, ఎందుకంటే వీటిలో ట్రాన్స్ కొవ్వులు ఉంటాయి. ఇవి తల్లినీ, బిడ్డను ఇబ్బంది పెట్టే ప్రమాదముంది కనుక ప్రెగ్నెన్సీ సమయంలో వీటిని మితంగా మాత్రమే తినండి.

Tags: pregnant women
Previous Post

వినాయ‌కుడి క‌థ నుంచి త‌ల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన ముఖ్య‌మైన విష‌యాలు ఇవే..!

Next Post

మ‌హిళ‌లు అస‌లు ఎందుకు గాజుల‌ను ధ‌రించాలి..?

Related Posts

ఆధ్యాత్మికం

ఆల‌యంలో ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తున్న‌ప్పుడు ఈ పొర‌పాట్ల‌ను అస‌లు చేయ‌కండి..!

July 9, 2025
lifestyle

పొరపాటున కూడా బంధువులకి చెప్పకూడని 5 సీక్రెట్స్ !

July 9, 2025
ఆధ్యాత్మికం

ఉల్లి, వెల్లుల్లిని బ్రాహ్మణులు ఎందుకు తిన‌రు..?

July 9, 2025
vastu

మీ అర‌చేతిలో…ఈ గుర్తుల్లో..ఏదైనా ఒక‌టుందా? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా??

July 9, 2025
lifestyle

ఆకుకూర‌లు లేదా కూర‌గాయ‌ల‌ను ఇలా నిల్వ చేస్తే ఎక్కువ రోజుల పాటు తాజాగా ఉంటాయి..!

July 9, 2025
information

ఇనుము తుప్పు పడుతుంది.. మరి రైలు పట్టాలు తుప్పు పడతాయా లేదా?

July 9, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
vastu

మీ అర‌చేతిలో…ఈ గుర్తుల్లో..ఏదైనా ఒక‌టుందా? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా??

by Admin
July 9, 2025

...

Read more
డ్రింక్స్‌

Oats Chocolate Milk Shake : బాగా ఆక‌లిగా ఉన్న‌ప్పుడు క్ష‌ణాల్లో దీన్ని చేసుకుని తాగండి.. త‌క్ష‌ణ‌మే శ‌క్తి ల‌భిస్తుంది..

by D
October 29, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.