Red Rice : ఆరోగ్యంగా ఉండేందుకు ప్రస్తుత తరుణంలో చాలా మంది తెల్ల అన్నంకు బదులుగా వివిధ రకాల రైస్‌లను తింటున్నారు. ముఖ్యంగా బ్రౌన్ రైస్‌ను అధికంగా తింటున్నారు. అయితే మనకు వివిధ రకాల రంగుల్లో ఉండే రైస్ లు కూడా లభిస్తున్నాయి. వాటిల్లో రెడ్ రైస్ కూడా ఒకటి. రెడ్ రైస్‌లో ఆంథోసయనిన్స్ అనే పిగ్మెంట్స్ అధికంగా ఉంటాయి. అందువల్లే ఆ రైస్‌కు రెడ్ కలర్ వస్తుంది. ఇక ఆంథోసయనిన్స్ సహజసిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్ల మాదిరిగా పనిచేస్తాయి. అందువల్ల రెడ్ రైస్‌ను తింటే మనం ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. రెడ్ రైస్ వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
రెడ్ రైస్‌లో మన శరీరానికి కావల్సిన పోషకాలు అనేకం ఉంటాయి. ముఖ్యంగా ఫైబర్, ఐరన్, మెగ్నిషియం, బి విటమిన్లు అధికంగా ఉంటాయి. నియాసిన్, థయామిన్, విటమిన్ బి6లతోపాటు ఇతర యాంటీ ఆక్సిడెంట్లు కూడా రెడ్ రైస్‌లో అధికంగా ఉంటాయి. అందువల్ల రెడ్ రైస్‌ను తింటే వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా ఇన్‌ఫెక్షన్లు దరిచేరవు. రెడ్ రైస్‌లో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణశక్తిని మెరుగు పరుస్తుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. దీని వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది. అలాగే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
రెడ్ రైస్‌లో ఉండే ఆంథోసయనిన్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేస్తాయి. దీంతో కణజాలం రక్షించబడుతుంది. అలాగే గుండె జబ్బులు, క్యాన్సర్లు, నాడీ సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి. రెడ్ రైస్‌ను రోజూ తినడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయని సైంటిస్టుల పరిశోధనల్లో వెల్లడైంది. రెడ్ రైస్‌లో మోనాకోలిన్స్ అనబడే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. దీని వల్ల హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు. రెడ్ రైస్‌లో సంక్లిష్టమైన పిండి పదార్థాలు ఉంటాయి. అందువల్ల ఈ రైస్‌ను తింటే షుగర్ లెవల్స్ వెంటనే పెరగవు. రక్తంలో చక్కెర నెమ్మదిగా కలుస్తుంది. ఇది డయాబెటిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు చేసే విషయం. అందువల్ల ఈ రైస్‌ను తింటే షుగర్ లెవల్స్‌ను నియంత్రణలో ఉంచుకోవచ్చు.
రెడ్ రైస్‌లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. ఆక్సీకరణ ఒత్తిడి, వాపులు తగ్గిపోతాయి. దీంతో గుండె ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా రెడ్ రైస్‌తో మనం అనేక లాభాలను పొందవచ్చు. కనుక దీన్ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి.