Reduce Diabetes And Cholesterol : మనం తరచూ వంటల్లో వెల్లుల్లిని వాడుతుంటాం. వెల్లుల్లిని వేయడం వల్ల కూరలకు చక్కని వాసన, రుచి వస్తాయి. ఆయుర్వేద ప్రకారం వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అందువల్ల దీన్ని రోజూ తింటే మనం ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అలాగే వీటిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు కూడా ఉంటాయి. వెల్లుల్లిలో ఉండే ఐరన్, జింక్, కాపర్, క్యాల్షియం మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. అందువల్ల వెల్లుల్లిని రోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి.
రోజూ ఉదయాన్నే పరగడుపునే వెల్లుల్లిని తినాల్సి ఉంటుంది. 2 లేదా 3 వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసి నేరుగా అలాగే నమిలి తినవచ్చు. అయితే ఇవి ఘాటుగా ఉంటాయి కనుక కాస్త తేనెతో తీసుకోవచ్చు. ఇక నమలడం ఇష్టం లేకపోతే దంచి తీసుకోవచ్చు. వెల్లుల్లిని బాగా నమలడం వల్ల అందులో అనేక సమ్మేళనాలు విడుదలవుతాయి. ఇవి మనకు ఎంతగానో మేలు చేస్తాయి. అందువల్ల వెల్లుల్లిని తప్పనిసరిగా దంచి లేదా నమిలి తినాల్సి ఉంటుంది. ఇలా వెల్లుల్లిని రోజూ తింటే షుగర్, కొలెస్ట్రాల్ లెవల్స్ దెబ్బకు తగ్గిపోతాయి. అధిక కొలెస్ట్రాల్, డయాబెటిస్ సమస్యలు ఉన్నవారికి ఈ మిశ్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది.
బరువు తగ్గుతారు..
ఈ మిశ్రమాన్ని తినడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో బరువు తగ్గడం తేలికవుతుంది. ఈ మిశ్రమాన్ని తీసుకుంటే జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణాశయం, పేగుల్లో ఉండే వ్యర్థాలు, క్రిములు బయటకు వెళ్లిపోతాయి. అయితే కొందరికి ఈ మిశ్రమం పడకపోవచ్చు. దీన్ని తీసుకున్న వెంటనే కొందరికి అలర్జీలు ఏర్పడుతాయి. అలాగే విరేచనాలు, వాంతికి వచ్చినట్లు ఉండడం, చర్మంపై దురదలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఈ మిశ్రమాన్ని తినడం మానేయాలి. డాక్టర్ సలహా తీసుకుని మాత్రమే దీన్ని తినాలి.
ఇక వెల్లుల్లి, తేనెను ఇలా తీసుకోవడం వల్ల ఇతర అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఈ మిశ్రమాన్ని తింటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుంది. దీంతో రక్తనాళాల్లో ఉండే కొవ్వు కరిగిపోతుంది. ఫలితంగా హార్ట్ ఎటాక్, హార్ట్ స్ట్రోక్ రాకుండా చూసుకోవచ్చు. అలాగే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. ముఖ్యంగా దగ్గు, జలుబు నుంచి బయట పడవచ్చు.
కీళ్ల నొప్పులు తగ్గుతాయి..
ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్ నొప్పుల నుంచి ఎంతగానో ఉపశమనం లభిస్తుంది. కీళ్లు, మోకాళ్ల నొప్పులు, వాపులు ఉన్నవారు రోజూ ఈ రెండింటినీ కలిపి తింటే ఫలితం ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఈ మిశ్రమం మంచి ఔషధంలా పనిచేస్తుంది. కనుక వెల్లుల్లిని ఈ విధంగా రోజూ తినడం మరిచిపోకండి. దీంతో అనేక లాభాలను పొందవచ్చు. ఆరోగ్యంగా ఉండవచ్చు.