కరోనా సమయంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అత్యంత ఆవశ్యకం అయింది. ఈ క్రమంలోనే కోవిడ్ రాకుండా ఉండేందుకు అందరూ అనేక రకాల పద్ధతులను పాటిస్తున్నారు. మాస్కులను ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం, వ్యక్తిగత శుభ్రతను పాటించడం చేస్తున్నారు. అయితే కోవిడ్ వచ్చాక ఊపిరితిత్తుల మీదే ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది కనుక ఊపిరితిత్తులను దృఢంగా ఉంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
కోవిడ్ వల్ల ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ త్వరగా వ్యాప్తి చెందుతుంది. కనుక వాటిని దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఊపిరితిత్తులు మన శరీరంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇవి మనం పీల్చే గాలిని శుభ్రం చేసి అందులో ఉండే ఆక్సిజన్‌ను శరీరానికి అందిస్తాయి. కనుక ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి.
ఆస్తమా, బ్రాంకైటిస్, న్యుమోనియా, టీబీ, క్యాన్సర్ వంటి వ్యాధులు ఊపిరితిత్తులకు వస్తాయి. కనుక వాటిని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అందుకు గాను పలు అలవాట్లను మానేయాల్సి ఉంటుంది.
చాలా మందికి మద్యం సేవించే అలవాటు ఉంటుంది. కొందరు పొగ తాగుతారు. ఈ రెండు అలవాట్లు ఊపిరితిత్తులకు మంచివి కావు. కనుక వారు వాటిని మానేయాలి. మద్యం, పొగాకు రెండూ ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయి. కరోనా వస్తే ఇంక అంతే సంగతులు. కనుక ఈ రెండు అలవాట్లకు దూరంగా ఉంటే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. దీంతో కోవిడ్ వచ్చినా తట్టుకునే శక్తి ఊపిరితిత్తులకు లభిస్తుంది.
ఉప్పు ఎక్కువగా తింటే గుండె ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతుంటారు. కానీ ఉప్పు ఎక్కువైతే ఊపిరితిత్తులకు ప్రమాదమే. ఉప్పులో సోడియం ఉంటుంది. దీన్ని ఎక్కువగా తీసుకుంటే ఆస్తమా వచ్చేందుకు కారణమవుతుంది. కనుక రోజూ తీసుకునే ఉప్పు పరిమాణాన్ని చాలా వరకు తగ్గించాలి. దీంతో ఊపిరితిత్తులు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి.
వేపుళ్లు మన ఆరోగ్యానికి మంచివి కావు. ఇవి స్థూలకాయం వచ్చేందుకు కారణమవుతాయి. అలాగే ఊపిరితిత్తులపై ఈ ఆహారాలు చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. కనుక వేపుళ్లకు దూరంగా ఉండడం ద్వారా ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. దీంతో కోవిడ్ రిస్క్ తగ్గుతుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365