Saffron : గర్భం దాల్చిన మహిళలు కుంకుమ పువ్వును రోజూ పాలలో కలుపుకుని తాగితే బిడ్డ ఎదుగుదల సరిగ్గా ఉంటుందని, బిడ్డకు పోషకాలు సరిగ్గా అందుతాయని.. వైద్యులు చెబుతుంటారు. అయితే నిజానికి కుంకుమ పువ్వు కేవలం గర్భిణీలకే కాదు అందరికీ ఎంతగానో మేలు చేస్తుంది. దీంతో అనేక అనారోగ్యాల నుంచి బయట పడవచ్చు. కుంకుమ పువ్వు వల్ల ఎన్ని లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. కుంకుమ పువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తాయి. క్యాన్సర్ కణాలను పెరగనీయవు. అందువల్ల కుంకుమ పువ్వును తీసుకుంటే క్యాన్సర్లు రాకుండా చూసుకోవచ్చు.
2. కుంకుమ పువ్వు కలిపిన పాలను రోజూ తాగుతుంటే డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి తగ్గుతాయి. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. చక్కగా నిద్ర పడుతుంది. నిద్ర లేమి నుంచి బయట పడవచ్చు.
3. మహిళలు నెలసరి సమయంలో కుంకుమ పువ్వు కలిపిన పాలను తాగితే ఇతర సమస్యల నుంచి బయట పడవచ్చు.
4. కుంకుమ పువ్వును పాలలో కలిపి తీసుకోవడం వల్ల స్త్రీ, పురుషులిద్దరిలోనూ శృంగార సామర్థ్యం పెరుగుతుంది. పురుషుల్లో వీర్య కణాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. దీంతో సంతానం కలిగే అవకాశాలు పెరుగుతాయి.
5. అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు రోజూ కుంకుమ పువ్వును తీసుకుంటే ఫలితం ఉంటుంది. బరువును వేగంగా తగ్గించుకోవచ్చు.
6. కుంకుమ పువ్వు కలిపిన పాలను రోజూ తాగడం వల్ల హార్ట్ ఎటాక్‌లు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని సైంటిస్టుల పరిశోధనల్లో వెల్లడైంది. అలాగే షుగర్ లెవల్స్‌ను నియంత్రణలో ఉంచుకోవచ్చు. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మతిమరుపు తగ్గుతుంది. మెదడు యాక్టివ్‌గా పనిచేస్తుంది. కంటి చూపును మెరుగు పరుస్తుంది.