Seeds For Hair : జుట్టు అందంగా, ఒత్తుగా, నల్లగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అలాగే అందమైన జుట్టు కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అనేక రకాల చిట్కాలు వాడతారు. మార్కెట్ లో లభించే అనేక రకాల నూనెలను, హెయిర్ ప్రొడక్ట్స్ ను, షాంపులను వాడుతూ ఉంటారు. అయినప్పటికి మనలో చాలా మందికి జుట్టు ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది. అలాగే జుట్టు పలుచబడడం, జుట్టు పెరుగువదల ఆగిపోవడం, జుట్టు పొడిబారడం వంటి సమస్యలతో మనలో చాలా మంది బాధపడుతున్నారు. వాతావరణ కాలుష్యం, ఒత్తిడి, ఆందోళన వంటి వాటితో పాటు మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లు కూడా ముఖ్య కారణాలని చెప్పవచ్చు. మారిన మన ఆహారపు అలవాట్ల కారణంగా మనలో చాలా మంది పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం లేదు.
దీని వల్ల జుట్టుకు కావల్సిన పోషకాలు అందక జుట్టు కుదుళ్లు బలహీనపడిపోతున్నాయి. దీంతో జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. జుట్టు పెరుగుదల ఆగిపోతుంది. మన శరీరం ఆరోగ్యంగా ఉండడానికి చక్కటి ఆహారం ఎంత అవసరమో జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే చక్కటి ఆహారాన్ని అందించడం కూడా అంతే అవసరం. కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల జుట్టు పెరుగుదల చక్కగా ఉంటుంది. ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల నల్లటి, ఒతత్తైన జట్టును చాలా సులభంగా పొందవచ్చు. జుట్టు పెరుగుదలకు తీసుకోవాల్సిన ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జుట్టు పెరుగుదలలో మనకు అవిసె గింజలు ఎంతో దోహదపడతాయి. వీటిలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగదలలో తోడ్పడంతో పాటు జుట్టు పాడవకుండా కాపాడడంలో కూడా దోహదపడతాయి.
కనుక మనం తీసుకునే ఆహారంలో అవిసె గింజలు ఉండేలా చూసుకోవాలి. జుట్టు పొడిబారడం, జుట్టు చిట్లడం వంటి సమస్యలను తగ్గించడంతో పాటు జుట్టు పొడవుగా పెరిగేలా చేయడంలో మనకు చియా విత్తనాలు ఎంతో సహాయపడతాయి. వీటిలో ప్నోటీన్స్ తో పాటు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. జుట్టు పెరుగుదలలో చియా విత్తనాలు ఎంతో తోడ్పడుతాయి. ఇక జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు కుదళ్లను బలంగా, ధృడంగా చేయడంలో గుమ్మడి గింజలు ఎంతో సహాయపడతాయి. వీటిలో జుట్ఉట పెరుగుదలకు అవసరమయ్యే ఎన్నో విటమిన్స్, మినరల్స్ ఉన్నాయి. గుమ్మడి గింజలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల చక్కటి ఆరోగ్యవంతమైన జుట్టును సొంతం చేసుకోవచ్చు. అలాగే జుట్టు పెరుగుదలకు అవసరమయ్యే విటమిన్ ఇ పొద్దు తిరుగుడు గింజల్లో ఎక్కువగా ఉంటుంది. జుట్టు పెరుగదలకు, జుట్టు కుదుళ్లు ఆరోగ్యంగా ఉంచడంలో ఇవి మనకు ఎంతో సహాయపడతాయి.
అలాగే వంటల్లో వాడే మెంతులను వాడడ వల్ల కూడా జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. వీటిలో ప్రోటీన్ , నియాసిన్, మెగ్నీషియం. పొటాషియం వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇవి జుట్టు పెరిగేలా చేయడంతో పాటు జుట్టును మృదువుగా ఉంచడంలో కూడా తోడ్పడుతాయి. అదే విధంగా నల్ల జీలకర్రను వాడడం వల్ల కూడా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్ ప్లామేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి తల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి జుట్టు పెరిగేలా చేయడంలో దోహదపడతాయి. ఈ విధంగా ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల జుట్టు సమస్యలు తగ్గడంతో పాటు రాకుండా ఉంటాయని అలాగే జుట్టు ఒత్తుగా, పొడవుగా, కాంతివంతంగా తయారవుతుందని నిపుణులు చెబుతున్నారు.