Sitting Posture : మారిన జీవిన విధానం కారణంగా మనలో చాలా మంది కూర్చుని చేసే ఉద్యోగాలు చేస్తున్నారు. రోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు కుర్చీలో కూర్చొని చేసే ఉద్యోగాలు చేస్తున్నారు. ఇలా చాలా సమయం ఒకే దగ్గర కూర్చొని ఉండడం వల్ల అలాగే కూర్చీలో సరైన భంగిమలో కూర్చొకపోవడం వల్ల అనేక సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది. చాలా మంది సరైన భంగిమలో కూర్చుంటున్నామని భావిస్తారు కానీ వారు సరైన భంగిమలో కూర్చోవడం లేదు. సరైన భంగిమలో కూర్చొకపోవడం వల్ల ఇది మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. నిరంతరం అసౌకర్యంగా ఉండడం, వీపు కింది భాగాన విపరీతమైన నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే మీరు సరైన భంగిమలో కూర్చోవడం లేదని అర్థం. అలాగే తరుచూ మెడ నొప్పి, భుజాల నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి.
అలాగే ఆ భాగాల్లో తీవ్ర అసౌకర్యంగా ఉంటుంది. ఇది కూడా సరైన భంగిమ కాదని సూచించే వాటిలో ఒకటి. అదే విధంగా సరైన భంగిమలో కూర్చోకపోవడం వల్ల తలనొప్పి ఎక్కువగా వస్తుంది. వెన్నెముక సరైన స్థితిలో లేకపోవడం వల్ల మెడ కండరాలపై ఒత్తిడి పడుతుంది. ఇది క్రమంగా తలనొప్పికి దారి తీస్తుంది. అలాగే సరైన భంగిమలో కూర్చోకపోవడం వల్ల రక్తప్రవాహం మరియు ఆక్సిజన్ సరఫరాలో అడ్డంకులు ఏర్పడతాయి. దీంతో మనం అలసట, నీరసం, శరీరంలో శక్తి తగ్గినట్టుగా అనుభవిస్తాము. మనం సరైన భంగిమలో కూర్చోవడం వల్ల శరీరంలో శక్తి స్థాయిలు పెరిగినట్టుగా అనిపిస్తాయి. అంతేకాకుండా మనం జీర్ణసమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. సరైన భంగిమలో కూర్చోకపోవడం వల్ల మలబద్దకం, యాసిడ్ రిప్లెక్షన్ వంటి సమస్యలు తలెత్తుతాయి. అలాగే సరైన స్థితిలో కూర్చోకపోవడం వల్ల శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది కలుగుతుంది.
సరైన స్థితిలో కూర్చోకపోవడం వల్ల ఊపిరితిత్తులు పూర్తిగా విస్తరించవు. దీంతో శ్వాస సమస్యలు తలెత్తుతాయి. అదే విధంగా సరైన భంగిమలో కూర్చోకపోవడం వల్ల మనలో సమన్వయం మరియు సమతుల్యత కూడా దెబ్బతింటుంది. మనం చేసే పనిలో తప్పులు ఎక్కువగా చేసే అవకాశం ఉంటుంది. అలాగే సరైన భంగిమలో కూర్చోకపోవడం వల్ల కొన్ని కండరాలు గట్టిపడతాయి. కాలక్రమేణా కొన్ని కండరాలు బలహీన పడతాయి. అలాగే సరిగ్గా కూర్చోకపోవడం వల్ల శరీరంలో ఫ్లేక్సిబిలిటీ తగ్గుతుంది. ఈ విధంగా ఇటువంటి లక్షణాలు కనుక మీలో కనిపిస్తే మీరు కూడా సరైన భంగిమలో కూర్చోవడం లేదని అర్థం.