Mangoes : వేసవికాలం రాగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేవి మామిడిపండ్లు. చాలా వీటిని ఎప్పుడేప్పుడు తిందామా అని ఎదురు చూస్తూ ఉంటారు. మనకు వివిధ రకాల మామిడి పండ్లు లభిస్తూ ఉంటాయి. మామిడిపండ్లు తియ్యగా చాలా రుచిగా ఉంటాయి. వయసుతో సంబంధం లేకుండా అందరూ వీటిని ఇష్టంగా తింటూ ఉంటారు. మామిడిపండ్లను తినడం వల్ల మన శరీరానికి అవసరమయ్యే వివిధ రకాల పోషకాలు కూడా లభిస్తూ ఉంటాయి. అయితే మామిడిపండ్లను తినే ముందు వాటిని నీటిలో నానబెట్టి తినాలని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఇలా నీటిలో నానబెట్టి తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి మరింత మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. నీటిలో నానబెట్టకుండా మామిడిపండ్లను తీసుకోవడం వల్ల ముఖంపై మొటిమలు వస్తూ ఉంటాయి. అలాగే మామిడిపండ్లను తినడం వల్ల శరీరంలో వేడి చేసే అవకాశం ఉంది.
అలాగే మలబద్దకం, జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంది. ఇటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే మామిడి పండ్లను మనం నీటిలో నానబెట్టి తీసుకోవాలి. అసలు మామిడిపండ్లను నీటిలో నానబెట్టి తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మామిడికాయల్లో సహజ సిద్దంగానే ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మనం తిన్న ఆహారంలో ఉండే పోషకాలు శరీరం గ్రహించకుండా అడ్డుపడుతుంది. దీంతో శరీరంలో పోషకాల లోపం తలెత్తుతుంది. మామిడిపండ్లను నీటిలో నానబెట్టి తీసుకోవడం వల్ల ఈ ఫైటిక్ యాసిడ్ మామిడి పండ్ల నుండి బయటకు విడుదల అవుతుంది. దీంతో మామిడి పండ్లను తిన్నప్పటికి మనకు ఎటువంటి హాని కలగదు. మామిడిపండ్లను పండించడానికి వివిధ రకాల మందులను, పురుగుమందులను వాడుతూ ఉంటారు.
మామిడి పండ్లను నేరుగా తీసుకోవడం వల్ల ఇవి మన జీర్ణవ్యవస్థను దెబ్బతీసే అవకాశం ఉంటుంది. అలాగే తలనొప్పి, మలబద్దకం, చర్మ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కనుక మామిడిపండ్లను నీటిలో నానబెట్టి తీసుకోవడం వల్ల ఈ సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే మామిడిపండ్లను తినడం వల్ల శరీరంలో వేడి చేసే అవకాశం ఉంది. వాంతులు, తల తిరిగినట్టు ఉండడం, ముఖంపై మొటిమలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అదే మామిడిపండ్లను తినే అరగంట ముందు నీటిలో నానబెట్టి తీసుకోవడం వల్ల వేడి చేయకుండా ఉంటుంది. అలాగే మామిడిపండ్లను అర గంట పాటు నీటిలో నానబెట్టి తీసుకోవడం వల్ల వాటిలో ఉండే విష పదార్థాలు కూడా తొలగిపోతాయి. కనుక మామిడిపండ్లను నీటిలో నానబెట్టి తీసుకోవడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.