Sperm Decreasing Foods : దంపతులు ఎవరైనా సరే పిల్లలు కావాలనే అనుకుంటారు. పిల్లలు వద్దనుకునే వారు ఎవరూ ఉండరు. అయితే కొందరు దంపతులు మాత్రం కొన్ని కారణాల వల్ల పిల్లలను పొందలేకపోతుంటారు. సంతానం కలగడంలో కొందరికి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. పిల్లలు పొందేందుకు కొందరు అనేక అవస్థలు పడుతుంటారు. అయితే సంతాన లోపం ఉండడానికి భార్యభర్తలు ఇద్దరూ కారణమే అవుతుంటారు. కొన్ని సార్లు స్త్రీలలో లోపం ఉంటుంది. కొందరు పురుషుల్లోనూ లోపాలు ఉంటాయి. అయితే పురుషులు కొందరు పాటించే అలవాట్ల వల్ల వీర్యం లోపం ఏర్పడి సంతానం కలగదు. ముఖ్యంగా కొందరు పురుషులు తీసుకునే ఆహారాలు వీర్యాన్ని నాశనం చేస్తాయి. దీంతో సంతానం కలగదు. ఇక వీర్యాన్ని నాశనం చేసే ఆ ఆహారాలు ఏమిటంటే..
సోయా ఉత్పత్తులు పురుషుల్లో ఈస్ట్రోజన్ హార్మోన్ స్థాయిలను పెంచుతాయి. సోయా గింజలు, ముఖ్యంగా మీల్ మేకర్ వంటి వాటిని పురుషులు అధికంగా తినరాదు. ఇవి వారిలో టెస్టోస్టిరాన్ స్థాయిలను తగ్గించి స్త్రీల హార్మోన్ అయిన ఈస్ట్రోజన్ స్థాయిలను పెంచుతాయి. దీంతో పురుషుల్లో వీర్యం ఉత్పత్తి తగ్గుతుంది. ఇది దీర్ఘకాలంలో వీర్య లోపం, శృంగార సామర్థ్యం లోపం వంటి సమస్యలకు దారి తీస్తుంది. దీంతో సంతానం కలగదు. కనుక పురుషులు సోయా ఉత్పత్తులను అధికంగా తీసుకోరాదు.
అలాగే కొందరు పురుషులు శీతల పానీయాలు లేదా మద్యాన్ని ఎక్కువగా సేవిస్తుంటారు. ఇవి పురుషుల్లో శృంగార సమస్యలను కలగజేస్తాయి. వీర్యాన్ని నాశనం చేస్తాయి. కనుక వీటిని కూడా తీసుకోకూడదు. అలాగే ప్యాకెట్లలో లేదా డబ్బాలలో నిల్వ చేయబడిన, ప్రాసెస్ చేయడిన ఆహారాలను కూడా తీసుకోరాదు. ఇవి వాస్తవానికి పురుషులకే కాదు.. ఎవరికైనా సరే మంచివి కావు. వీటిని తీసుకుంటే హార్మోన్ల సమస్యలను కలగజేస్తాయి. పురుషుల్లో ఇవి వీర్యాన్ని నాశనం చేస్తాయి. కనుక ఈ ఆహారాలకు కూడా దూరంగా ఉండాలి. ఇక ప్యాకెట్ పాలు లేదా ప్యాకెట్ పెరుగును కూడా పురుషులు తక్కువగా తీసుకోవాలి. సహజసిద్ధమైన పదార్థాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. లేదంటే అవి హార్మోన్ల సమస్యలను కలగజేస్తాయి. దీంతో వీర్యం లోపిస్తుంది. ఫలితంగా సంతానం లోపం ఏర్పడుతుంది. కనుక పురుషులు ఈ ఆహారాలను ఎట్టి పరిస్థితిలోనూ తీసుకోరాదు.