Garlic : ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది నిత్యం ఉపయోగించే పదార్థాల్లో వెల్లుల్లి ఒకటి. దీన్ని రోజూ మనం వంటల్లో వేస్తుంటాం. దీంతో వంటకాలకు చక్కని రుచి, వాసన వస్తాయి. వెల్లుల్లి వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. దీన్ని రోజూ తినాలి. రోజూ ఉదయాన్నే పరగడుపునే నాలుగు పచ్చి వెల్లుల్లి రెబ్బలను అలాగే తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. వెల్లుల్లిలో ఆల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. అందువల్ల రోజూ పచ్చి వెల్లుల్లి రెబ్బలను తింటే మన శరీర రోగ నిరోధక వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. ఇన్ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. ముఖ్యంగా ఈ సీజన్‌లో వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
2. వెల్లుల్లిని తినడం వల్ల గుండెకు ఎంతగానో మేలు జరుగుతుంది. హార్ట్ ఎటాక్ లు రాకుండా ఆపవచ్చు. హైబీపీ, కొలెస్ట్రాల్ తగ్గుతాయి.
3. డయాబెటిస్ ఉన్నవారు రోజూ వెల్లుల్లిని తినడం వల్ల ఫలితం ఉంటుంది. రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గుతాయి.
4. వెల్లుల్లిని తినడం వల్ల మెదడు యాక్టివ్‌గా మారుతుంది. ఉత్తేజంగా పనిచేస్తుంది. మతిమరుపు తగ్గి ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి.
గమనిక : వెల్లుల్లిని తినడం మంచిదే అయినప్పటికీ ఇది కొందరిలో జీర్ణ సమస్యలను కలగజేస్తుంది. గ్యాస్, అసిడిటీ వస్తాయి. కనుక అలాంటి సమస్యలు వచ్చిన వారు వెల్లుల్లిని తినడం ఆపేయాలి. ఇక వెల్లుల్లిని నేరుగా పచ్చిగా తినలేమని అనుకునేవారు వాటిని దంచి ఆ మిశ్రమాన్ని తేనెతో కలిపి తీసుకోవచ్చు. దీంతో కూడా అద్భుతమైన లాభాలు కలుగుతాయి.