Mint Leaves : పుదీనా ఆకులను సహజంగానే తరచూ చాలా మంది ఉపయోగిస్తుంటారు. వీటిని ఎక్కువగా వంటల్లో వేస్తుంటారు. అయితే ఇవి అందించే లాభాల గురించి చాలా మందికి తెలియదు. పుదీనాలో ఎన్నో ఔషధగుణాలు ఉంటాయి. పుదీనా ఆకులను రోజూ నేరుగా అలాగే తినవచ్చు. లేదా జ్యూస్ కూడా తాగవచ్చు. పరగడుపునే పుదీనా ఆకులు 4, 5 లేదా వాటి రసం అయినా తీసి తాగాలి. దీని వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. పుదీనా ఆకులను నమలడం వల్ల జీర్ణవ్యవస్థ శుభ్రంగా మారుతుంది. మలబద్దకం, గ్యాస్, అజీర్ణం, కడుపు ఉబ్బరం, కడుపులో మంట తగ్గిపోతాయి. ఆకలి బాగా అవుతుంది. జీర్ణాశయం, పేగుల్లో ఉండే క్రిముటు చనిపోతాయి. అల్సర్ పుండ్లు నయమవుతాయి.
2. పుదీనా ఆకులను నమలడం వల్ల నోరు తాజాగా మారుతుంది. నోట్లో ఉండే బాక్టీరియా నశిస్తుంది. దీంతో నోటి దుర్వాసన తగ్గిపోతుంది. దంతాలు, చిగుళ్లు దృఢంగా, ఆరోగ్యంగా మారుతాయి.
3. పుదీనా ఆకులను నమలడం వల్ల విరేచనాల నుంచి విముక్తి లభిస్తుంది. పూటకు 3, 4 ఆకులను తింటే విరేచనాలు తగ్గిపోతాయి.
4. దగ్గు, జలుబు, గొంతు సమస్యలు ఉన్నవారు, కఫం బాగా ఉన్నవారు పుదీనా ఆకులను నమిలితే మెరుగైన ఫలితం ఉంటుంది. అలాగే వికారం, తలతిరగడం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.
5. పుదీనా ఆకులను 3, 4 తిని కొద్దిగా మజ్జిగ సేవించాలి. దీంతో కడుపు నొప్పి తగ్గిపోతుంది. అలాగే పుదీనా ఆకుల రసం, చక్కెర సమాన భాగాల్లో కలిపి తీసుకుంటే వెక్కిళ్లు తగ్గిపోతాయి.
6. పుదీనా ఆకులను రోజూ నమిలి తింటుంటే మెదడు యాక్టివ్‌గా మారుతుంది. చురుగ్గా ఉంటుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
7. డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి వంటి మానసిక సమస్యలు ఉన్నవారు రోజూ పుదీనా ఆకులను తింటే ఫలితం ఉంటుంది. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు.