భారతీయులు నిత్యం వాడే అనేక వంట ఇంటి పదార్థాల్లో వెల్లుల్లి కూడా ఒకటి. దీన్ని నిత్యం చాలా మంది కూరల్లో వేస్తుంటారు. పచ్చళ్లు, ఇతర వంటల్లో వేస్తుంటారు. వెల్లుల్లి వల్ల వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే రోజూ పరగడుపునే కాల్చిన వెల్లుల్లి రెబ్బలు 4 తింటే మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. పురుషుల్లో టెస్టోస్టిరాన్ వారి శృంగార సామర్థ్యాన్ని పెంచేందుకు, వీర్యం తయారు అయ్యేందుకు ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే ఈ హార్మోన్ తగినంతగా లేకపోతే సమస్యలు వస్తాయి. కానీ వెల్లుల్లి రెబ్బలను తినడం వల్ల శరీరంలో ఈ హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో ఆయా సమస్యలు తగ్గుతాయి.
2. వెల్లుల్లి గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. హార్ట్ ఎటాక్‌లను రాకుండా చూస్తుంది. వెల్లుల్లిలో ఉండే ఔషధ గుణాలు గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి.
3. వెల్లుల్లిలో యాంటీ బయోటిక్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. అందువల్ల వాటిని తింటే దగ్గు, జలుబు తగ్గుతాయి.
4. వెల్లుల్లి రెబ్బలను తినడం వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
5. వెల్లుల్లి తింటే నోరు వాసన వస్తుందని కొందరు తినరు. కానీ వెల్లుల్లిని తినడం వల్ల నోట్లో ఉండే బాక్టీరియా నశిస్తుంది. దీంతో దంతాలు, చిగుళ్ల సమస్యలు ఉండవు.
వెల్లుల్లి రెబ్బలను ఉదయాన్నే పరగడుపునే నేరుగా తినవచ్చు. కానీ వాటిని అలాగే తినలేని వారు వాటిని రోస్ట్‌లా చేసుకుని తినవచ్చు. పెనంపై వాటిని కొద్దిగా వేయించి తినవచ్చు. దీంతో ఘాటుదనం తగ్గుతుంది. రోజూ వెల్లుల్లిని ఇలా తింటే పైన తెలిపిన ప్రయోజనాలు కలుగుతాయి.