పండ్ల రసాలు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో మనకందరకూ తెలిసిందే. అవి చాలా రుచి. ఎంతో శక్తినిస్తాయి ప్రతిరోజు మన శరీరానికి అవసరమైన నీరు, విటమిన్లు, పోషకాలు ఇస్తాయి. అయితే, శరీరానికి అవసరమైన నిద్రనిచ్చే ఒకే ఒక పండు చెర్రీగా కనుగొన్నారు.
చెర్రీలు నిద్రను ప్రభావించే సహజ హార్మోన్ అయిన మెలాటోనిన్ ను తయారు చేస్తాయని ఒక తాజా రీసెర్చి తెలుపుతోంది. ఈ హార్మోన్ బ్రెయిన్ లో తయారవుతుంది. ఈ హార్మోన్ ఉత్పత్తి చేసే గ్రంధులు పగటికంటే కూడా రాత్రులందు బాగా చురుకుగా వుంటాయి. మెలటోనిన్ లో యాంటీ ఆక్సిడెంట్లు వుంటాయి. ఇవి నిద్రను అధికం చేస్తాయి. ఈ కారణంగానే చెర్రీ జ్యూస్ నిద్రకు మంచి ఔషధంగా చెపుతున్నారు.
ప్రతిరోజూ రెండు గ్లాసులు చెర్రీ జ్యూస్ తీసుకుంటే అది మన నిద్రను కనీసం 45 నిమిషాలు అధికం చేస్తుందంటున్నారు రీసెర్చర్లు. ఈ హార్మోన్ అనేక రకాలుగా ప్రయోజనాల్నిస్తుంది. శరీరంలో వయసుపైబడేసే ఫ్రీ ర్యాడికల్స్ ను నాశనం చేస్తుంది. ఈ హార్మోన్ బాదంపప్పులు, పాలు, పీ నట్స్, చికెన్ మొదలైన వాటిలో కూడా వుంటుందట.