Triphala Churnam : చాలామంది, రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. నిజానికి ఆయుర్వేదం చాలా చక్కగా పనిచేస్తుంది. ఆయుర్వేద వైద్యంలో త్రిఫల చూర్ణానికి ఉన్న ప్రాధాన్యత గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఉసిరికాయ, కరక్కాయ, తానికాయల మిశ్రమంతో కూడిన త్రిఫల చూర్ణం వలన ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. వాత, పిత్త, కఫ సమస్యలకి మంచి ఔషధం ఇది. ప్రతి రోజు త్రిఫల చూర్ణం తీసుకోవడం వలన, చాలా రకాల అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు. ఆయుర్వేద నిపుణులు కూడా త్రిఫల చూర్ణాన్ని తీసుకుంటే వివిధ సమస్యలకు దూరంగా ఉండొచ్చు అని చెప్తున్నారు.
సమస్త రోగాలని తగ్గించే శక్తి త్రిఫల చూర్ణానికి ఉంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లలో, అర స్పూన్ వరకు త్రిఫల చూర్ణం వేసి బాగా మిక్స్ అయ్యే వరకు కలిపేసిm రాత్రంతా ఉంచి తర్వాత రోజు ఉదయం తాగాలి. భోజనం చేయడానికి ముందు తాగితే మంచిది. ఇలా తాగడం వలన, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎర్ర రక్త కణాలు కూడా పెరుగుతాయి. గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు కూడా ఉండవు. ఆకలి కూడా బాగా పుడుతుంది.
శరీరం నుండి విష పదార్థాలను ఇది బయటకి పంపిస్తుంది. లివర్ ఆరోగ్యానికి కూడా హెల్ప్ చేస్తుంది. త్రిఫల చూర్ణాన్ని తీసుకుంటే, ఊపిరితిత్తుల్లో తేమ, స్లేష్మం యొక్క సమతుల్యతని కాపాడుతుంది. శ్వాసకోశ వ్యాధుల నుండి దూరంగా త్రిఫల చూర్ణం ఉంచుతుంది. అంతేకాకుండా, కండరాలు స్థాయిని కాపాడుతుంది.
త్రిఫల చూర్ణం తీసుకోవడం వలన కండరాలు దృఢంగా మారుతాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. బీపీ కూడా కంట్రోల్ లో ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళు తీసుకుంటే కూడా మంచిది. షుగర్ లెవెల్స్ ని త్రిఫల చూర్ణంతో నియంత్రణలో ఉంచచ్చు. ఇలా ఇన్ని సమస్యలకి త్రిఫల చూర్ణం ఉపయోగపడుతుంది. రెగ్యులర్ గా త్రిఫల చూర్ణాన్ని తీసుకోండి ఈ సమస్యలకు దూరంగా ఉండండి.