వైవాహిక జీవితంలో లైంగిక ఆరోగ్యం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అదే సమయంలో ఒత్తిడి, చెడు జీవనశైలి, ధూమపానం మొదలైన వాటి కారణంగా పురుషుల లైంగిక ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది. కానీ పురుషులు తమ శృంగార జీవితంలో వచ్చే సమస్యలకు పలు ఇంటి చిట్కాలను పాటించవచ్చు. దీని కోసం పురుషులు క్రమం తప్పకుండా ఒక గ్లాసు నీటిలో ప్రత్యేకమైన విత్తనాలను మిక్స్ చేసి తీసుకోవాలి. దాని గురించి తెలుసుకుందాం.
పురుషులు తమ లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సోంపు గింజల పొడిని నీటిలో కలిపి తీసుకోవాలి. పురుషులు ఈ నీళ్లను తాగడం ద్వారా వారు అంగస్తంభన అనగా నపుంసకత్వము నుండి బయట పడవచ్చు. ఒత్తిడి, ధూమపానం, పేలవమైన జీవనశైలి మొదలైన వాటి కారణంగా పురుషుల జననేంద్రియాలకు రక్త ప్రవాహం సరిగ్గా జరగదు.
రక్త ప్రవాహం అంతరాయం కారణంగా శృంగారంలో పాల్గొన్నప్పుడు జననేంద్రియాలలో తగినంత ఉద్రిక్తత జరగదు. కానీ స్మెల్ అండ్ టేస్ట్ ట్రీట్మెంట్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రకారం.. సోంపు గింజలలో ఉండే మెల్లి లైకోరైస్ ఫ్లేవర్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అందువల్ల పురుషులకు సోంపు గింజల నీళ్లు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.
రాత్రిపూట ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ సోంపు గింజల పొడి కలపండి. దానిపై మూత పెట్టండి. మరుసటి రోజు ఉదయం ఆనీటిని ఫిల్టర్ చేసి తాగండి. ఆయుర్వేద నిపుణుడు డాక్టర్ అబ్రార్ ముల్తానీ ప్రకారం.. సోంపులో విటమిన్ సి, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంతోపాటు మంటను తగ్గించడంలో సహాయపడతాయి. దీంతో జననేంద్రియాలకు రక్త సరఫరా మెరుగు పడుతుంది. ఫలితంగా శృంగారంలో పాల్గొన్నప్పుడు అంగ స్తంభన సమస్య ఏర్పడదు. అలాగే వీర్యం ఉత్పత్తి అవుతుంది. శుక్ర కణాలు చురుగ్గా కదులుతాయి. నాణ్యంగా ఉంటాయి. దీంతో సంతానం కలిగే అవకాశాలు పెరుగుతాయి. ఈ విధంగా సోంపు గింజలను వాడి పురుషులు అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు.