Garlic : మనకు చక్కటి ఆరోగ్యాన్ని అందించే వాటిలో వెల్లుల్లి పాయలు కూడా ఒకటి. వెల్లుల్లిని మనం వంటలల్లో విరివిగా వాడుతూ ఉంటాము. దీనిలో ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వెల్లుల్లిని తీసుకోవడం వల్ల మనం అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. వెల్లుల్లిని క్రమం తప్పకుండా రోజూ తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. నెల రోజుల పాటు క్రమం తప్పకుండా రోజూ వెల్లుల్లిని తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతిరోజూ వెల్లుల్లిని తీసుకోవడం వల్ల మనం రోగాల బారిన తక్కువగా పడతాము. దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి వైరస్, బ్యాక్టీరియాల వల్ల కలిగే ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా కాపాడడంలో దోహదపడతాయి. వెల్లుల్లిని తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్ ప్లామేషన్ తగ్గుతుంది. శరీరంలో ఇన్ ప్లామేషన్ తగ్గడం వల్ల మనం అనేక దీర్ఘకాలిక మరియు ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఉంటాము. అలాగే రోజూ వెల్లుల్లి రెబ్బలను తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. అదిక రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. వెల్లుల్లిలో నైట్రిక్ ఆక్సైడ్ ఉంటుంది. ఇది రక్తనాళాలు వ్యాకోచించేలా చేసి రక్తప్రసరణ సాఫీగా సాగేలా చేయడంలో సహాయపడుతుంది. అధిక రక్తపోటు సమస్యతో బాధపడే వారు రోజూ వెల్లుల్లిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
అంతేకాకుండా వెల్లుల్లిని తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచడంలో వెల్లుల్లి మనకు ఎంతో సహాయపడుతుంది. వెల్లుల్లిని తీసుకోవడం వల్ల రక్తంలో ట్రై గ్లిజరాయిడ్ స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. ఇక వెల్లుల్లిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. షుగర్ వ్యాధితో బాధపడే వారు క్రమం తప్పకుండా రెండు నుండి మూడు నెలల పాటు వెల్లుల్లిని రోజూ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి. అలాగే వెల్లుల్లిని తీసుకోవడం వల్ల శారీరక సామర్థ్యం పెరుగుతుంది. రోజంతా ఉత్సాహంగా పని చేసుకోగలుగుతాము. శరీరంలో ఉండే వ్యర్థాలను, మలినాలు, విష పదార్థాలను బయటకు పంపించడంలో, రక్తాన్ని శుభ్రంగా ఉంచడంలో కూడా వెల్లుల్లి మనకు ఉపయోగపడుతుంది.
అలాగే మోనోపాజ్ దశలో ఉండే స్త్రీలు రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలను తీసుకోవడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. అదే వింగా వెల్లుల్లిని తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. చర్మానికి సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. అయితే ఈ వెల్లుల్లిని ఎంత మోతాదులో తీసుకోవాలి.. ఉడికించి తీసుకోవాలా.. పచ్చిగా తీసుకోవాలా అనే సందేహాలు మనలో చాలా మందికి వస్తాయి. మనం రోజూ ఒక వెల్లుల్లి రెబ్బను మాత్రమే తీసుకోవాలి. అలాగే దీనిని వీలైనంత వరకు పచ్చిగానే తీసుకోవాలి. అప్పుడే మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ విధంగా వెల్లుల్లి మనకు ఎంతో దోహదపడుతుందని ప్రతి ఒక్కరు దీనిని తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.