హెల్త్ టిప్స్

ర‌క్త‌హీన‌త స‌మ‌స్య ఉన్న‌వారు వీటిని తీసుకుంటే రక్తం బాగా త‌యార‌వుతుంది..!

శ‌రీరంలో త‌గిన‌న్ని ఎర్ర ర‌క్త క‌ణాలు లేకపోతే ర‌క్తం త‌యారు కాదు. దీంతో శ‌రీర భాగాల‌కు ఆక్సిజ‌న్ స‌రిగ్గా అందదు. ఈ స్థితినే ర‌క్త‌హీన‌త అంటారు. ఓ స‌ర్వే ప్ర‌కారం దాదాపుగా 68 శాతం మంది పిల్ల‌లు, 66 శాతం మంది మ‌హిళ‌లు ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న‌ట్లు వెల్ల‌డైంది. ఎర్ర ర‌క్త క‌ణాల్లో హిమోగ్లోబిన్ ఉంటుంది. ఇది ఒక ప్రోటీన్‌. ఇందులో ఐర‌న్ ఉంటుంది. రక్త‌హీన‌త స‌మ‌స్య ఉన్న‌వారిలో త‌గినంత హిమోగ్లోబిన్ ఉత్ప‌త్తి కాదు. దీని వ‌ల్ల ఎర్ర రక్త క‌ణాలు త‌యారు కావు. ఈ క్ర‌మంలో శ‌రీర అవ‌యవాల‌కు ఆక్సిజ‌న్ స‌రిగ్గా అంద‌దు. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య కొన్ని సార్లు ఫోలేట్ లేదా విట‌మిన్ బి 12 లోపం వ‌ల్ల కూడా వ‌స్తుంది. దీంతోనూ ఎర్ర ర‌క్త క‌ణాలు త‌యారు కావు.

take iron foods daily to overcome anemia

ఐర‌న్ లోపం వ‌ల్ల ర‌క్త‌హీన‌త స‌మ‌స్య సాధార‌ణంగా వ‌స్తుంటుంది. అలాగే బి విట‌మిన్లు, సి విట‌మిన్ ల లోపాలు కూడా ర‌క్త‌హీన‌త‌కు కార‌ణాలు అవుతుంటాయి. ఈ క్ర‌మంలోనే ర‌క్త‌హీన‌త స‌మ‌స్య ఉన్న‌వారు వైద్యుల‌ను క‌లిసి ప‌రీక్ష‌లు చేయించుకుని ఆ మేర మందుల‌ను వాడాల్సి ఉంటుంది. అలాగే కింద తెలిపిన ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి ఐర‌న్ బాగా ల‌భిస్తుంది. దీంతో ర‌క్త‌హీన‌త స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

1. ఆకు ప‌చ్చ‌ని కూర‌గాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల ర‌క్త‌హీన‌త స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. వాటిల్లో ఐర‌న్ ఎక్కువ‌గా ఉంటుంది. దీంతో శ‌రీరానికి ఐర‌న్ ల‌భిస్తుంది. ఐర‌న్ లోపం నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ర‌క్తం బాగా త‌యార‌వుతుంది.

2. సిట్ర‌స్ పండ్లైన నారింజ‌లతోపాటు బీన్స్ వంటి ఆహారాల‌ను తీసుకోవాలి. వీటిల్లో ఫోలేట్ ఉంటుంది. విట‌మిన్ సి ఉండే పండ్లు, కూర‌గాయ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఐర‌న్‌ను శరీరం ఎక్కువ‌గా గ్ర‌హిస్తుంది. అలాగే రాజ్మా, శ‌న‌గ‌లు, సోయా బీన్‌, ప‌చ్చి బ‌ఠానీల‌ను కూడా తీసుకోవ‌చ్చు.

3. సీ ఫుడ్ తిన‌డం వ‌ల్ల కూడా ఐర‌న్ ఎక్కువ‌గా ల‌భిస్తుంది. స‌ముద్ర‌పు చేప‌లు, పీత‌లు, రొయ్య‌ల‌ను తింటే ఐర‌న్ ఎక్కువ‌గా అందుతుంది. దీంతో ఐర‌న్ లోపం నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

4. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య ఉన్న‌వారు అవిసె గింజ‌లు, గుమ్మ‌డి కాయ విత్త‌నాలు, జీడిప‌ప్పు, పిస్తాలు, తృణ ధాన్యాల‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి.

5. మాంసాహార ప్రియులు మ‌ట‌న్ లివ‌ర్‌, మ‌ట‌న్‌ల‌ను తింటే ఐర‌న్‌ను ఎక్కువ‌గా పొంద‌వ‌చ్చు. లివ‌ర్‌లో ఐర‌న్‌, ఫోలేట్ ఎక్కువ‌గ ఉంటాయి. అలాగే ఇత‌ర మాంసాహారాల‌ను తిన‌డం వ‌ల్ల కూడా ఐరన్‌ను పొంద‌వ‌చ్చు.

6. ఎరుపు రంగులో ఉండే కూర‌గాయ‌లు, పండ్ల‌ను ఎక్కువ‌గా తీసుకుంటున్నా ఐర‌న్‌ను పొంద‌వ‌చ్చు. దీంతో ఐరన్ లోపం స‌మ‌స్య త‌గ్గుతుంది. ర‌క్తం బాగా త‌యార‌వుతుంది.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Share
Admin

Recent Posts