Oats : రోజూ ఉదయం చాలా మంది రక రకాల బ్రేక్‌ఫాస్ట్‌లను తింటుంటారు. అయితే ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్‌లను తింటే మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఓట్స్ ను రోజూ తినడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఓట్స్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యల నుంచి బయట పడేస్తుంది. అధిక బరువు తగ్గేలా చూస్తుంది. షుగర్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుకోవచ్చు.
2. ఓట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందువల్ల ఫ్రీ ర్యాడికల్స్ నశిస్తాయి. కణాలు సురక్షితంగా ఉంటాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
3. ఓట్స్ ను రోజూ తినడం వల్ల శరీరంలో ఉండు చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) తగ్గుతుంది. దీని వల్ల గుండె జబ్బులు.. ముఖ్యంగా హార్ట్ ఎటాక్ లు రాకుండా జాగ్రత్త పడవచ్చు.
4. హైబీపీ సమస్య ఉన్నవారికి ఓట్స్ ఎంతగానో మేలు చేస్తాయి. వీటిని తినడం వల్ల శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ తగ్గుతుంది. గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు.
5. ఓట్స్‌ను రోజూ చిన్నారులకు తినిపించడం వల్ల వారిలో ఆస్తమా అటాక్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది. కనుక ఓట్స్ ను రోజూ తినడం వల్ల అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.