Energy : ప్రస్తుతం చాలా మంది ఉరుకుల పరుగుల బిజీ జీవితాన్ని గడుపుతున్నారు. నిత్యం ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి మళ్లీ నిద్రించే వరకు అనేక సందర్భాల్లొ తీవ్ర ఒత్తిడి, ఆందోళనలను ఎదుర్కొంటున్నారు. దీంతో అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అలాగే శరీరంలోని శక్తి, సామర్థ్యాలు సన్నగిల్లుతున్నాయి. దీంతో నీరసం, నిస్సత్తువ చాలా మందిని ఆవహిస్తున్నాయి. ఫలితంగా ఎలాంటి శారీరక శ్రమ చేయలేకపోతున్నారు. శక్తి లేనట్లు ఫీలవుతున్నారు. తీవ్రంగా అలసట వస్తోంది. అయితే నిత్యం తీసుకునే ఆహారంలో వీటిని చేర్చుకుంటే.. ఈ సమస్యలన్నింటి నుంచి సులభంగా బయట పడవచ్చు. మరి ఆ ఆహారాలు ఏమిటంటే..
ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో పనీర్ లేదా మొలకెత్తిన గింజలను తింటుండాలి. ఇవి శరీరానికి అమితమైన శక్తిని అందిస్తాయి. దీంతో నీరసం, నిస్సత్తువ ఉండవు. శరీరం చురుగ్గా ఉంటుంది. యాక్టివ్‌గా పనిచేస్తారు. రోజంతా పనిచేసేందుకు కావల్సిన శక్తి లభిస్తుంది. అలసిపోరు. అలాగే శరీరం దృఢంగా ఉంటుంది. ఒత్తిడి, ఆందోళన నుంచి బయట పడవచ్చు.
ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌తోపాటు మొలకెత్తిన గింజలను తినడం వల్ల శరీర శక్తి సామర్థ్యాలు పెరగడమే కాదు.. జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి. షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. అధిక బరువు తగ్గుతారు. కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా మొలకెత్తిన గింజలను ఉదయాన్నే తింటే అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
ఇక వీటితోపాటు పనీర్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఉదయం దీన్ని తినడం వల్ల శరీరానికి కాల్షియం, ప్రోటీన్లు పెద్ద మొత్తంలో లభిస్తాయి. ఇవి కండరాలు, ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతో శక్తి బాగా లభిస్తుంది. ఫలితంగా అలసట అనేది ఉండదు. రోజు మొత్తం యాక్టివ్‌గా పనిచేయవచ్చు. కనుక ఉదయం పనీర్, మొలకెత్తిన గింజలను తినడం అలవాటు చేసుకోవాలి..!