Cholesterol : ఈ 10 ర‌కాల సూప‌ర్ ఫుడ్స్‌ను తిన్నారంటే చాలు.. కొలెస్ట్రాల్ మొత్తం త‌గ్గిపోతుంది..!

Cholesterol : ఈ ఆహారాల‌ను తీసుకుంటే చాలు మ‌నం చెడు కొలెస్ట్రాల్ సమ‌స్య నుండి చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చని మీకు తెలుసా…? అవును మీరు విన్న‌ది నిజ‌మే..! నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది చెడు కొలెస్ట్రాల్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లే ఈ స‌మ‌స్యకు ప్ర‌ధాన కార‌ణం. చెడు కొలెస్ట్రాల్ కార‌ణంగా మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. ముఖ్యంగా గుండె జ‌బ్బుల బారిన ప‌డే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. కొన్నిసార్లు చెడు కొలెస్ట్రాల్ మ‌ర‌ణానికి కూడా కార‌ణం అవ్వ‌వ‌చ్చు. క‌నుక ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డం చాలా అవ‌స‌రం. చెడు కొలెస్ట్రాల్ స‌మస్య‌తో బాధ‌ప‌డే వారు రోజూ ఆహారంలో భాగంగా ఇప్పుడు చెప్పే వాటిని తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. ఈ ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి.

చెడు కొలెస్ట్రాల్ స్థాయిల‌ను అదుపులో ఉంచే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రోజూ ఆహారంలో భాగంగా ఓట్స్ ను తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. ఓట్స్ లో బీటా గ్లూకాన్ పుష్క‌లంగా ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ ను త‌గ్గించ‌డంలో ఇది ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. అలాగే బ‌చ్చ‌లికూర‌, తోట‌కూర వంటి ఆకుకూర‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మంచి ఫ‌లితం ఉంటుంది. వీటిలో ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది. ఆకుకూర‌ల‌ను రోజూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గుతాయి. గుండె జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయి. ఇక బెర్రీ జాతికి చెందిన పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మంచి ఫ‌లితం ఉంటుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో న్యూట్రియెంట్లు, ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది.

take these 10 super foods to reduce Cholesterol
Cholesterol

చెడు కొలెస్ట్రాల్ ను త‌గ్గించ‌డంలో, ర‌క్త‌నాళాల ప‌నితీరును మెరుగుప‌ర‌చ‌డంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో ఇవి ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి. చెడు కలెస్ట్రాల్ ను త‌గ్గించ‌డంలో వెల్లుల్లి మ‌న‌కు ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే స‌మ్మేళ‌నం ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ ను త‌గ్గించ‌డంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో దోహ‌ద‌ప‌డుతుంది. వంట‌ల్లో ఆలివ్ నూనెను వాడ‌డం వ‌ల్ల కూడా మ‌నం చెడు కొలెస్ట్రాల్ స్థాయిల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. ఈ నూనెలో మోనో అన్ శాచురేటెడ్ కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ‌గా ఉంటాయి. కొలెస్ట్రాల్ ను త‌గ్గించ‌డంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో ఆలివ్ నూనె మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. అదే విధంగా మ‌న రోజు వారి ఆహారంలో భాగంగా అవ‌కాడోను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మ‌నం కొలెస్ట్రాల్ స్థాయిల‌ను అదుపులో ఉంచుకోవ‌చ్చు.

ఇక ఆహారంలో భాగంగా చేప‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మంచి ఫ‌లితం ఉంటుంది. చేప‌ల‌ల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువ‌గా ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. అలాగే చెడు కొలెస్ట్రాల్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు సోయా ఉత్ప‌త్తుల‌ను వాడ‌డం మంచిది. వీటిలో ప్రోటీన్, ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉండ‌డంతో పాటు గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. అలాగే రోజు వారి ఆహారంలో భాగంగా బీన్స్, చిక్కుళ్లు, రాజ్మా వంటి వాటిని తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మంచి ఫ‌లితం ఉంటుంది. ఈ విధంగా ఈ ఆహారాల‌ను మ‌న రోజు వారి ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల చెడు కొలెస్ట్రాల్ స‌మ‌స్య నుండి చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చని నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts