హెల్త్ టిప్స్

హిమోగ్లోబిన్ పెర‌గాలంటే ఈ ఆహారాల‌ను తీసుకోవాలి..!

మన శరీరంలో హిమోగ్లోబిన్ తగ్గితే మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు, ఎముకల్లో బలహీనత ఏర్పడుతుంది. అందుచేత ఆహారంలో మార్పులు చేయడం అవసరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. హిమోగ్లోబిన్ అనేది ఒక ప్రోటీన్‌. మ‌నం తిన్న ఆహారంలో ఉండే పోష‌కాల‌తోపాటు ర‌క్తంలో ఉండే ఆక్సిజ‌న్‌ను శ‌రీర భాగాల‌కు చేర‌వేస్తుంది. ఇది ఎర్ర ర‌క్త క‌ణాల త‌యారీకి కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది. క‌నుక శ‌రీరంలో త‌గినంత హిమోగ్లోబిన్ ఉండాలి. లేదంటే అనేక వ్యాధులు వ‌స్తాయి. ముఖ్యంగా ర‌క్త‌హీన‌త స‌మ‌స్య వస్తుంది. అయితే హిమోగ్లోబిన్ స్థాయిలు త‌క్కువ‌గా ఉన్న‌వారు ప‌లు ఆహారాల‌ను తింటుంటే ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌ళో భాగంగా ఒక గ్లాస్ పాల‌ను సేవించాలి. పాల‌లో ఉండే ప్రోటీన్లు హిమోగ్లోబిన్ పెరుగుద‌ల‌కు స‌హాయ ప‌డ‌తాయి. అలాగే ఒక యాపిల్ పండును కూడా తినాలి. ఇందులో ఐర‌న్ ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ ఉత్ప‌త్తికి ఉప‌యోగ‌ప‌డుతుంది. రాత్రి పూట నాలుగైదు ఖ‌ర్జూరాల‌ను నీటిలో నాన‌బెట్టి ఉద‌యం బ్రేక్ ఫాస్ట్‌లో భాగంగా తీసుకోవాలి. దీంతో కూడా హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి.

take these foods daily to increase hemoglobin levels in body

రోజూ రాగి జావ‌ను సేవిస్తుంటే శ‌రీరం చ‌ల్ల‌బ‌డ‌డ‌మే కాదు అనేక పోష‌కాలు ల‌భిస్తాయి. ముఖ్యంగా రాగుల్లో ఉండే ఐర‌న్ మన శ‌రీరంలో హిమోగ్లోబిన్‌ను పెంచుతుంది. ర‌క్తం త‌యార‌య్యేలా చేస్తుంది. సాయంత్రం పూట రాగి జావ‌ను తాగుతుంటే ఉప‌యోగం ఉంటుంది. అర‌టి పండ్లు కూడా మ‌న శ‌రీరంలో హిమోగ్లోబిన్ స్థాయిల‌ను పెంచుతాయి. ఈ పండ్ల‌ను ఉద‌యం లేదా సాయంత్రం తీసుకోవ‌చ్చు. రోజూ భోజ‌నంలో ప‌ప్పు, ఆకుకూర‌లు ఉండేలా చూసుకోండి. ఇవి కూడా హిమోగ్లోబిన్ స్థాయిల‌ను పెంచుతాయి. రాత్రి నిద్ర‌కు ముందు గుప్పెడు ప‌ల్లీలు, బెల్లం, ఖ‌ర్జూరాల‌ను తిన‌వ‌చ్చు. దీంతో కూడా హిమోగ్లోబిన్‌ను పెంచుకోవ‌చ్చు.

Admin

Recent Posts