Heart Attack : మీ ర‌క్త‌నాళాలు ఆరోగ్యంగా ఉండి హార్ట్ ఎటాక్ రావ‌ద్దు అనుకుంటే రోజూ వీటిని తినాలి..!

Heart Attack : మ‌న దేశంలోనే కాదు ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాలా మంది హార్ట్ ఎటాక్ బారిన ప‌డి ప్రాణాలు కోల్పోతున్నారు. కోవిడ్ వ‌చ్చి వెళ్లాక చాలా మంది ర‌క్తం గ‌డ్డ క‌ట్టి చ‌నిపోతున్నారు. ఇందుకు కార‌ణాలు అనేకం ఉంటున్న‌ప్ప‌టికీ స‌రైన జీవ‌న విధానం పాటించ‌క‌పోవ‌డ‌మే ముఖ్య కార‌ణం అని తెలుస్తోంది. రోజూ వేళ‌కు భోజ‌నం చేయ‌క‌పోవ‌డం, శారీర‌క శ్ర‌మ చేయ‌క‌పోవ‌డం, నిత్యం గంట‌ల త‌ర‌బ‌డి కూర్చుని ఉండ‌డం, ఒత్తిడి, ఆందోళ‌న వంటి కార‌ణాలు హార్ట్ ఎటాక్‌కు కార‌ణ‌మ‌వుతున్నాయి. అయితే ఇప్పుడు చెప్ప‌బోయే ఆహారాల‌ను రోజూ తింటే చాలు దాంతో హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవ‌చ్చు. ఇక ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

అవ‌కాడోల గురించి అంద‌రికీ తెలిసిందే. వీటిల్లో ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు ఉంటాయి. మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వుల‌తోపాటు పొటాషియం స‌మృద్ధిగా ఉంటుంది. ఇవి మ‌న శ‌రీరంలో ర‌క్త‌నాళాల్లో పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్‌)ను త‌గ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్‌)ను పెంచుతాయి. దీంతో ర‌క్త‌నాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఫ‌లితంగా హార్ట్ ఎటాక్ రాదు. అలాగే ఆలివ్ ఆయిల్‌ను ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల కూడా ర‌క్త‌నాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు, మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి వాపుల‌ను త‌గ్గిస్తాయి. కొలెస్ట్రాల్ లెవ‌ల్స్‌ను నియంత్రిస్తాయి. దీంతో హార్ట్ ఎటాక్ రాకుండా ఉంటుంది.

take these foods daily to prevent Heart Attack in future
Heart Attack

సాల్మ‌న్‌, మాక‌రెల్‌, సార్డిన్స్ త‌దిత‌ర ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే చేప‌ల‌ను తింటుండాలి. ఇవి వాపుల‌ను త‌గ్గించ‌డంతోపాటు బీపీని నియంత్రిస్తాయి. దీంతో ర‌క్తంలో ట్రై గ్లిజ‌రైడ్స్ త‌గ్గుతాయి. ఫ‌లితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. నిపుణులు చెబుతున్న ప్ర‌కారం బాదంప‌ప్పు, వాల్ న‌ట్స్‌లో ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు, ప్రోటీన్లు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ లెవ‌ల్స్‌ను త‌గ్గిస్తాయి. దీంతో ర‌క్త‌నాళాల్లో ఉండే కొవ్వు క‌రుగుతుంది. ఫ‌లితంగా హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవ‌చ్చు.

బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు, ఇత‌ర బెర్రీల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అలాగే ఫైబ‌ర్ ల‌భిస్తుంది. ఇవి బీపీని త‌గ్గిస్తాయి. వాపుల‌ను కంట్రోల్ చేస్తాయి. దీని వ‌ల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. పాల‌కూర, తోట‌కూర త‌దిత‌ర ఆకుకూర‌ల్లో నైట్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ‌గా ఉంటాయి. ఇవి ర‌క్త‌స‌ర‌ఫ‌రాను మెరుగు ప‌రుస్తాయి. బీపీని త‌గ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. క‌నుక ఈ ఆహారాల‌ను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవ‌డం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు. దీంతో హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవ‌చ్చు.

Share
Editor

Recent Posts