Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

ఈ ఆహారాల‌ను తింటే చాలు.. పొగ తాగ‌డం ఇట్టే మానేస్తారు..!

Admin by Admin
June 11, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

స్మోకింగ్ మానేయడం అనేది చాలా మందికి సాధించలేని లక్ష్యంలానే ఉంటుంది. ధూమపానాన్ని మానేయాలని ఎంత ప్రయత్నించినా అది రెండు మూడు రోజులకు.. మహా అయితే ఒక వారానికే పరిమితం అవుతుంటుంది. అయితే ఈ కష్టమైన, గొప్ప ప్రయాణాన్ని సులభతరం చేయడంలో ఆహారం కూడా ముఖ్యపాత్ర పోషిస్తుందని నిపుణులు చెప్తున్నారు. ప్రతి స్మోకర్ జీవితంలో కూడా ధూమపానం మానేయాలని అనేది ఓ గొప్ప ఆశయం. ఇది సాధించిన వారిని తప్పకుండా అప్రీషియేట్ చేయాల్సిందే. అయితే నిపుణుల ప్రకారం.. స్మోకింగ్ మానేయాలని అనుకునేవారికి మంచి ఆహార అలవాట్లను అలవర్చుకోవడం ఎంతో ఉపయోగపడుతుంది. మన ప్రతిరోజూ ఆహారంలో న్యూట్రీషినల్ ఆహారాన్ని చేర్చుకోవడం ధూమపానాన్ని మానేయాలన్న జర్నీలో మనకు ఊతమిస్తుంది. అందుకే తాము స్మోకింగ్ మానేయాలని భావించే ప్రతి ఒక్కరికి కూడా యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని, ఫలాలు, గింజలు, కూరగాయలు చేర్చుకోవడం మంచిదంటున్నారు. ఇవి స్మోకింగ్ వల్ల ఏర్పడిన ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గిస్తాయి. స్మోకింగ్ మానేయాలనుకునే వారు ఆహారంలో ఇవి చేర్చుకుంటే మంచిది..

యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉండే పండ్లు, వెజిటేబుల్స్, ఆకుకూరలు, కారెట్లు చేర్చుకోవాలి. యాంటీఆక్సిడెంట్లు ఆక్సిడేటివ్ ఒత్తిడిన తగ్గించడంలో, కణాలను రిపేర్ చేసుకోవడంలో సహాయపడతాయి. ఒమెగా3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే చేపలు, ఫ్లాక్స్ విత్తనాలు, వాల్‌నట్స్ వంటిని తీసుకోవాలి. ఈ ఆరోగ్యకరమైన ఆహారాలు యాంటీ-ఇఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటాయి. ఇవి స్మోకింగ్‌కు చెందిన మంట వంటి భావనను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అదే విధంగా స్మోకింగ్ మానేయాలన్న దృఢ నిశ్చయంతో ఉన్న వారు తమ స్నాక్స్‌లో బాదం పప్పు, సన్‌ఫ్లవర్ విత్తనాలు, గుమ్మడికాయ విత్తనాలు వంటివి తినాలి. వీటిలో విటమిన్-ఈ పుష్కలంగా ఉండి మన చర్మ ఆరోగ్యాన్ని పెంచడంలో ఉపయోగపడతాయి.

take these foods daily to stop smoking

ఓట్స్, బ్రౌన్ రైస్, క్వినోవా వంటి తృణధాన్యాలు మన ఎనర్జీని స్థిరంగా విడుదలయ్యేలా చూస్తాయి. రక్తంలో షుగర్ స్థాయిలను కూడా స్థిరీకరిస్తాయి. దాంతో పాటుగా ధూమపానం మానేయడం వల్ల పొగ తాగాలని అనిపించే కోరికలను అదుపు చేయడంలో కీలకంగా పనిచేస్తాయి.వీటన్నింటితో పాటుగా శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాల్సిన అవసరం కూడా చాలానే ఉంది. అధిక మొత్తంలో నీళ్లు, హెర్బల్ టీ వంటివి తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. హైడ్రేటెడ్‌గా ఉండటం స్మోకింగ్ క్రేవింగ్స్‌ను తగ్గిస్తుంది. వీలైనంత వరకు గ్రీన్ టీ తాగడం మరింత సహాయపడుతుంది. అంతేకాకుండా కాల్షియం అధికంగా ఉండే డైరీ, ఫోర్టిఫైడ్ ఆకుకూరల ఆహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. స్మోక్ చేయడం వల్ల శరీరంలోని కాల్షియం స్థాయిలు తగ్గిపోతాయి. వాటిని మెయింటెన్ చేయడంలో, తిరిగి ఉత్పత్తి చేయడంలో ఈ ఆహారం బాగా ఉపయోగపడుతుంది.

Tags: Smoking
Previous Post

ఈ కూర‌గాయ‌ల‌ను త‌ర‌చూ తినండి.. ఎంత‌టి కొవ్వు ఉన్నా ఇట్టే క‌రిగిపోతుంది..!

Next Post

ముందుకు 10 నిమిషాలు న‌డిచే క‌న్నా.. వెన‌క్కి 3 నిమిషాలు న‌డిస్తే చాలు..

Related Posts

ఆధ్యాత్మికం

చనిపోయిన వారి ఫోటోలని దేవుడి పూజ గదిలో పెడుతున్నారా ?

June 12, 2025
Home Tips

ఇంట్లో బియ్యం పురుగు పట్టకుండా ఫ్రెష్ గా ఉండాలంటే.. సింపుల్ చిట్కాలు..!!

June 12, 2025
వినోదం

అలనాటి ఈ సీనియర్ హీరోయిన్స్ ఇప్పుడు ఎంత పారితోషికం తీసుకుంటున్నారంటే ?

June 12, 2025
వినోదం

పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సినిమాల్లో నటించమని అడిగితే ఎందుకు శోభన్ బాబు రిజెక్ట్ చేశారు..?

June 12, 2025
వైద్య విజ్ఞానం

మీరు టాయిలెట్ లో ఫోన్ వాడుతున్నారా.. అయితే ఈ విషయాలను తప్పక తెలుసుకోండి..!

June 12, 2025
lifestyle

ఈ 5 లక్షణాలున్న అబ్బాయిలను అమ్మాయిలు బాగా ఇష్టపడతారట! అవేంటంటే..?

June 12, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!