Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

కారం తిన్నాక, నోరు మండితే వెంటనే చక్కెర తినేస్తాం…ఇలా చేయడం మంచిదేనా?

Admin by Admin
April 18, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

జిహ్వకో రుచి అన్న చందంగా ఈ ప్ర‌పంచంలోని వ్య‌క్తులంద‌రూ భిన్న‌మైన రుచుల‌ను కలిగి ఉంటారు. ఆ రుచులంటేనే వారు ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌తారు. ప్ర‌ధానంగా జ‌నాలు ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డే రుచుల్లో చెప్పుకోద‌గిన‌వి రెండు అవి తీపి, కారం. చాలా మందికి ఇవి అంటేనే ఎక్కువ‌గా ఇష్టంగా ఉంటాయి. అయితే తీపి సంగ‌తి ప‌క్క‌న పెడితే కారంను కూడా చాలా మందే తింటారు. కానీ కారంను ఇష్టంగా తినే వారు అంత‌గా మంట‌ను ఫీల్ అవ్వ‌రు. ఇక తిన‌క తిన‌క ఒక్క‌సారి కారం తింటే అలాంటి వారి ప‌రిస్థితి ఎలా ఉంటుందో మ‌నం అర్థం చేసుకోవ‌చ్చు. నాలుకంతా మంట‌గా మార‌డంతో మిర‌ప‌కాయ తిన్న కాకిలా మారిపోతారు. నోరంతా ఊ… అని ఉసికొడుతుంటారు. అలాంటి వారు వెంటనే వెళ్లి గుప్పెడంత చక్కెరను నోట్లో వేసుకుంటారు. అయితే కారంతో నోరు మంటగా ఉన్నప్పుడు చక్కెర ను తినడం అంత శ్రేయస్కరం కాదు..చక్కెరకు బదులుగా ఈ పదార్థాలు తింటే కారంమంట తగ్గడమే కాకుండా….ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

బాగా కారంగా ఉన్న ప‌దార్థాల‌ను తిన‌డం వ‌ల్ల నోరంతా మంట‌గా మారితే వెంట‌నే ఒక గ్లాస్ పాలు తాగేయండి. దీంతో మంట త‌గ్గుతుంది. పాల‌ల్లో ఉండే కేసీన్ నాలుక‌పై ఏర్ప‌డే మంట‌ను త‌గ్గిస్తుంది. బ్రెడ్‌, అన్నం, ఉడికిన ఆలుగ‌డ్డ‌లు వంటి పిండి ప‌దార్థాలు అధికంగా ఉన్న ఆహారాన్ని నోట్లో వేసుకుని న‌మిలి మింగాలి. దీని వ‌ల్ల నాలుక మంట త‌గ్గుతుంది. ఒక నిమ్మ‌కాయ‌ను తీసి అడ్డంగా కోసి ఆ ముక్క‌ను నోట్లో పిండుకోవాలి. దాన్నుంచి వ‌చ్చే ర‌సం నాలుక మంట‌ను త‌గ్గిస్తుంది. ఒక టీస్పూన్ తేనెను నోట్లో వేసుకుని కొంత సేపు అలాగే ఉంచి అనంత‌రం ఆ తేనెను మింగేయాలి. దీంతో నాలుక‌, నోట్లో ఉన్న కారం మంట త‌గ్గుతుంది.

take these foods if you have burnt tongue after chilli intake

పీన‌ట్ బ‌ట‌ర్‌ను నోట్లో వేసుకున్నా కారం మంట నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. కారం వ‌ల్ల విడుద‌ల‌య్యే కెమిక‌ల్స్ ప్ర‌భావాన్ని పీన‌ట్ బ‌ట‌ర్ త‌గ్గిస్తుంది. అవ‌కాడో, అర‌టి పండును ఒక్కోదాన్ని తీసుకుని వాటిని బాగా న‌లిపి నోట్లో వేసుకుని న‌మ‌లాలి. దీంతో కారం బాధ త‌గ్గుతుంది. వేరే వస్తువులు ఏవీ అందుబాటులో లేనప్పుడు…తప్పని పరిస్థితుల్లో చక్కెరను తినొచ్చు. అయితే చ‌క్కెర‌ను వెంట‌నే న‌మిలి మింగేయ‌కూడ‌దు. కొంత సేపు నోట్లో అలాగే ఉంచుకోవాలి.

Tags: burnt tonguechilli
Previous Post

నోటి నుంచి దుర్వాస‌న వ‌స్తుందా..? ఈ టిప్స్ పాటించండి చాలు..!

Next Post

గుర్తు తెలియని వ్యక్తితో భార్య చాటింగ్.. భర్త తిట్టినందుకు ఆమె చేసిన పిచ్చి పని ఏంటంటే ?

Related Posts

ఆధ్యాత్మికం

గాజులు ధరించడం వల్ల స్త్రీలకు ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసా..?

June 8, 2025
వినోదం

మోక్షజ్ఞ జాతకంలో అది కలిసి రాదు అంటూ సంచలన కామెంట్స్ చేసిన వేణు స్వామి..!!

June 8, 2025
వినోదం

ఖుషి సినిమాలో నటించిన ముంతాజ్ ఇప్పుడెలా ఉందొ తెలుసా ? ఏమి చేస్తుందంటే ?

June 8, 2025
వైద్య విజ్ఞానం

డ‌యాబెటిస్ ఉన్న‌వారికి గుండె పోటు ఎందుకు వ‌స్తుంది..?

June 8, 2025
హెల్త్ టిప్స్

కేవలం పండ్లు లేదా వెజిట‌బుల్ జ్యూస్‌ల‌ను తాగితే క‌లిగే లాభాలు ఇవే..!

June 8, 2025
చిట్కాలు

త‌ల‌నొప్పి త‌గ్గేందుకు ఈ 4 ఆహారాలను తీసుకోవ‌చ్చు.. కానీ..?

June 8, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!