ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ ఆహారాల‌ను తీసుకోండి.. హైబీపీ త‌గ్గుతుంది..!

రోజులో మ‌నం మూడు పూట‌లా తినే ఆహారాల్లో బ్రేక్‌ఫాస్ట్ చాలా ముఖ్య‌మైన‌ది. అందువ‌ల్ల అందులో అన్ని ర‌కాల పోష‌కాలు ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి. బ్రేక్‌ఫాస్ట్‌లో మ‌నం తీసుకునే ఆహారాల వ‌ల్లే మ‌న‌కు ఎక్కువ‌గా లాభాలు క‌లుగుతాయి. అధిక బ‌రువు త‌గ్గుతారు. బీపీ నియంత్ర‌ణ‌లో ఉంటుంది.

ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ ఆహారాల‌ను తీసుకోండి.. హైబీపీ త‌గ్గుతుంది..!

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే బీపీ నియంత్ర‌ణ‌లో ఉండాలి. బీపీ కంట్రోల్‌లో లేక‌పోతే గుండె జ‌బ్బులు వ‌స్తాయి. హార్ట్ ఎటాక్‌లు వ‌చ్చేందుకు అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. క‌నుక బీపీని కంట్రోల్ చేయాలి. అయితే మెగ్నిషియం ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో తింటే దాంతో బీపీని త‌గ్గించుకోవ‌చ్చు.

మెగ్నిషియం ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త నాళాలు ప్ర‌శాంతంగా మారి వెడ‌ల్పుగా అవుతాయి. దీంతో ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. ఫ‌లితంగా బీపీ త‌గ్గుతుంది. హైబీపీ నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

మెగ్నిషియం విష‌యానికి వ‌స్తే తోట‌కూర‌, గుమ్మ‌డికాయ విత్త‌నాలు, అవిసె గింజ‌లు, పాల‌కూర‌, యాప్రికాట్స్, బాదంప‌ప్పు, చిక్కుడు కాయ‌లు, అవ‌కాడో, అర‌టి పండ్లు, అంజీర్‌, మిల్లెట్స్ వంటి వాటిలో అధికంగా ఉంటుంది. అందువ‌ల్ల ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ ఆహారాల‌ను తింటుండాలి. దీంతో మెగ్నిషియం బాగా ల‌భిస్తుంది. బీపీ త‌గ్గుతుంది. త‌ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు.

Share
Admin

Recent Posts