వర్షాకాలంలో ఇన్‌ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పదార్థాలను తీసుకోవాలి..!

వర్షాకాలం వచ్చిందంటే చాలు వాతావరణం ఒక్కసారిగా చల్ల బడుతుంది. అప్పటి వరకు ఎండ వేడితో అల్లాడిపోయే మనం చల్లని వాతావరణంలో సేదదీరుతాం. అయితే వర్షాకాలం చల్లగానే ఉంటుంది, కానీ దీంతోపాటు వ్యాధులు కూడా వస్తుంటాయి. అజాగ్రత్తగా ఉంటే ఇన్‌ఫెక్షన్లు సంభవిస్తాయి. అనారోగ్య సమస్యలు వస్తాయి. దీంతోపాటు సీజనల్‌గా వచ్చే దగ్గు, జలుబు, జ్వరం.. వంటివి సరేసరి. ఈ క్రమంలోనే వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల మనల్ని మనం రక్షించుకోవాలంటే అందుకు కింద తెలిపిన పదార్థాలను రోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి. మరి ఆ పదార్థాలు ఏమిటంటే..

take these foods in monsoon to keep diseases and infections at bay

1. పసుపు

పసుపులో యాంటీ మైక్రోబియల్‌, యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. అందువల్ల ఇన్‌ఫెక్షన్లు రాకుండా అడ్డుకోవచ్చు. పసుపు భారతీయులందరి ఇళ్లలోనూ ఉంటుంది. కనుక దీన్ని వాడడం సులభమే. దీన్ని తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. రోజూ రాత్రి నిద్రించే ముందు ఒక గ్లాస్‌ పాలలో చిటికెడు పసుపు కలుపుకుని తాగడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు.

2. అల్లం

అల్లంను రోజూ తీసుకోవడం వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. అల్లం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. మోషన్‌ సిక్‌నెస్‌ను తగ్గిస్తుంది. నొప్పుల నుంచి బయట పడవచ్చు. అల్లం రసంను నేరుగా తీసుకోవచ్చు. లేదా అల్లంను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని రెండు పూటలా తాగవచ్చు. దీంతో ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది.

3. దాల్చిన చెక్క

దాల్చిన చెక్క సువాసనను కలిగి ఉంటుంది. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. దీన్ని ఎన్నో వేల ఏళ్ల కిందటి నుంచి ఉపయోగిస్తున్నారు. దీంతో గొంతు సమస్యలు, వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. దాల్చిన చెక్కను నీటిలో మరిగించి ఆ నీటిని ఒక కప్పు మోతాదులో రోజూ రాత్రి నిద్రించే ముందు తాగాలి. దీంతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.

4. మెంతులు

మెంతుల్లో అనేక యాంటీ ఆక్సిడెంట్లు, శరీరానికి అవసరమైన పోషకాలు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. శరీరంలోని ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. అధికంగా ఉండే నీరు బయటకు పోతుంది. మెంతులను రాత్రి పూట నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే పరగడుపునే తినవచ్చు. లేదా మెంతులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని కప్పు మోతాదులో తాగవచ్చు. దీని వల్ల ప్రయోజనం కలుగుతుంది.

5. హెర్బల్‌ టీ లేదా గ్రీన్‌ టీ

వర్షాకాలం సీజన్‌లో రోజూ హెర్బల్‌ లేదా గ్రీన్‌ టీ రెండింటిలో ఏదో ఒక టీని రోజూ తాగితే మంచిది. ఈ టీలను తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి జలుబు, ఇన్‌ఫెక్షన్లను రాకుండా చూస్తాయి. ఒక కప్పు వేడి హెర్బల్‌ టీ లేదా గ్రీన్‌ టీని తాగడం వల్ల గొంతు సమస్యలు తగ్గుతాయి. టాన్సిల్స్‌ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

6. వేడి పదార్థాలు

వర్షాకాలంలో వేడి పదార్థాలనే తినాలి. వండిన వెంటనే ఆహారాన్ని తినడం మేలు. ఆహారం చల్లబడేకొద్దీ అందులో బాక్టీరియా పెరుగుతుంది. ఈ క్రమంలో చద్ది ఆహారాలను తింటే ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. అనారోగ్యాల బారిన పడతారు. చల్లని ఆహారాలను తీసుకున్నా ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. కనుక వేడి పదార్థాలను తినాలి. అలాగే గోరు వెచ్చని నీటిని తాగాలి. ఇది ఆహారాన్ని జీర్ణం చేసేందుకు ఉపయోగపడుతుంది. దీంతో శరీరంలో ఉండే విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి.

7. ఇతర సూచనలు

వర్షాకాలంలో వ్యక్తిగత శుభ్రతే కాదు, పరిసరాల శుభ్రత కూడా ముఖ్యమే. మన చుట్టూ ఉండే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను ఎల్లవేళలా పాటించాలి. రోజూ స్నానం చేయాలి. వర్షంలో ఎక్కువ సేపు తడిసి వస్తే వెంటనే వేడి నీటితో స్నానం చేయాలి. వీధుల్లో లభించే చిరుతిళ్లు, ఫాస్ట్‌ ఫుడ్స్, జంక్‌ ఫుడ్స్‌ను తినరాదు. ఇన్‌ఫెక్షన్లకు సగం అవ్వే కారణం అవుతాయి. కనుక వాటికి దూరంగా ఉండాలి. ఈ సూచనలు పాటించడం వల్ల వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండవచ్చు.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Share
Admin

Recent Posts