Monsoon : వ‌ర్షాకాలంలో రోగాలు రావొద్దంటే.. వీటిని తీసుకోవాలి..!

Monsoon : వ‌ర్షాకాలం వ‌చ్చిందంటే చాలు అనారోగ్య స‌మ‌స్య‌లు మ‌న‌ల్ని చుట్టుముడ‌తాయి. జలుబు, ద‌గ్గు, జ్వ‌రం, టైఫాయిడ్, మ‌లేరియా, డెంగ్యూ, విరోచ‌నాలు, వాంతులు ఇలా అనేక ర‌కాల ఇన్పెక్ష‌న్ ల బారిన ప‌డుతూ ఉంటాము. ఇటువంటి ఇన్పెక్ష‌న్ ల బారిన ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణం మ‌న శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉండ‌డమే. వాతావ‌ర‌ణం మార‌డం వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు రావ‌డం స‌హ‌జ‌మే. అయితే వీటి బారిన మ‌నం ప‌డ‌కుండా ఉండాలంటే మ‌న శ‌రీరంలో త‌గినంత రోగ నిరోధ‌క శ‌క్తి ఉండేలా చూసుకోవాలి. ఇన్పెక్ష‌న్ ల బారిన ప‌డ‌కుండా ఉండాలంటే కాలానుగుణంగా ల‌భించే ఆహారాల‌ను తీసుకోవ‌డం, శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే ఆహారాల‌ను తీసుకోవాలి. జ్వ‌రాల బారిన ప‌డి ఇబ్బందులు ప‌డ‌డానికి బ‌దులుగా చ‌క్క‌టి ఆహారాన్ని తీసుకోవ‌డం ఉత్త‌మం.

క‌నుక వ‌ర్షాకాలంలో వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచే ఆహారాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో ప‌చ్చిమిర‌ప‌కాయ ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. దీనిలో పైపెరిన్ అనే ఆల్కలాయిడ్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు, విట‌మిన్ సి కూడా ఎక్కువ‌గా ఉంటాయి. అలాగే ప‌చ్చి మిర‌ప‌కాయ యాంటీ మైక్రోబ‌యల్ గుణాల‌ను కూడా క‌లిగి ఉంటుంది. ప‌చ్చి మిప‌ర‌కాయ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రో గ నిరోధ‌క శక్తి పెరగ‌డంతో పాటు ఆహారం ద్వారా వ్యాపించే అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన కూడా ప‌డ‌కుండా ఉంటాము.

take these foods in Monsoon to prevent diseases
Monsoon

అలాగే విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉండే నారింజ, జామ‌, చెర్రీ, ఆల్ బుక‌రా, ప్ల‌మ్స్, దానిమ్మ‌ వంటి వాటిని తీసుకోవాలి. వీటిని సాధ్య‌మైనంత వ‌ర‌కు న‌మిలి తినాలి లేదా ఇంట్లోనే జ్యూస్ గా చేసి తీసుకోవాలి. బ‌య‌ట రోడ్ల ప‌క్క‌న ల‌భించే జ్యూస్ ల‌ను తీసుకోకూడ‌దు. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరిగి ఇన్పెక్ష‌న్ ల బారిన ప‌డ‌కుండా ఉంటాము. అలాగే వ‌ర్ష‌కాలంలో ఎక్కువ‌గా సూప్, గ్రీన్ టీ, మ‌సాలా టీ వంటి వాటిని తీసుకోవాలి. వీటిని గోరు వెచ్చ‌గా ఉన్న‌ప్పుడే తీసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించాలి. అదే విధంగా సాధ్య‌మైనంత వ‌ర‌కు ఆకుకూర‌ల‌ను వ‌ర్షాకాలంలో తీసుకోక‌పోవ‌డ‌మే మంచిది. వీటిపై బ్యాక్టీరియా ఎక్కువ‌గా ఉండే అవ‌కాశం ఉంది.

అలాగే ఏ కూర‌గాయ‌ల‌నైనా ఉడికించి మాత్ర‌మే తీసుకోవాలి. ప‌చ్చిగా వేటిని తీసుకోకూడ‌దు. అలాగే ప్రో బ‌యాటిక్స్ ఎక్కువ‌గా ఉండే పెరుగు, మ‌జ్జిగ వంటి వాటిని తీసుకోవాలి. ఇవి జీర్ణాశ‌యంలో మంచి బ్యాక్టీరియా పెరిగేలా చేస్తాయి. దీంతో మ‌నం ఆహారం వ‌చ్చే ఇన్పెక్ష‌న్ ల బారిన ప‌డ‌కుండా ఉంటాము. అలాగే శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెర‌గాలంటే ప్రోటీన్ ఎక్కువ‌గా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. బీన్స్, చిక్కుళ్లు, గుడ్లు, సోయా, పాలు మ‌రియు పాల ఉత్ప‌త్తులు వంటి వాటిని తీసుకోవాలి. అలాగే అల్లం మ‌రియు వెల్లుల్లిని ఎక్కువ‌గా తీసుకోవాలి. వీటిలో యాంటీ బ్యాక్టీరియ‌ల్, యాంటీ వైర‌ల్, యాంటీ ఇన్ల‌మేట‌రీ వంటి ల‌క్ష‌ణాలు అధికంగా ఉన్నాయి.

వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల వైర‌స్, బ్యాక్టీరియాల వ‌ల్ల క‌లిగే ఇన్పెక్ష‌న్ ల బారిన‌ప‌డ‌కుండా ఉంటాము. అదే విధంగా ఆహారంలో భాగంగా ప‌సుపు క‌లిపిన పాల‌ను తీసుకోవాలి. ప‌సుపులో యాంటీ బ్యాక్టీరియ‌ల్, యాంటీ వైర‌ల్, యాంటీ మైక్రోబ‌యాల్ వంటి ల‌క్ష‌ణాలు ఎన్నో ఉన్నాయి,. శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి ని పెంచి జ‌బ్బుల బారిన ప‌డ‌కుండా చేయ‌డంలో ప‌సుపు ఎంత‌గానో దోహ‌ద‌ప‌డుతుంది. ఈ విధంగా ఈ ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరిగి మ‌నం వ‌ర్షాకాలంలో వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా ఉంటామ‌ని నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts