Chicken And Mutton : మనలో చాలా మంది నీరసం, బలహీనత వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. తరచూ నీరసంగా ఉండడం వల్ల వారు వారి పనులను చేసుకోలేకపోతూ ఉంటారు. అలాగే ఏ పని పైనా శ్రద్ద పెట్టలేకపోతూ ఉంటారు. అలాగే తరచూ నీరసంగా ఉండడం వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. కనుక మనం పుష్టిగా, బలంగా తయారవడం చాలా అవసరం. నీరసం తగ్గాలంటే బలవర్దకమైన ఆహారాలను తీసుకోవాలి. చాలా మంది బలవర్దకమైన ఆహారాలు అనగానే మాంసం అని అనుకుంటూ ఉంటారు. మాంసం బలవర్దకమైన ఆహారమే అయినప్పటికి ప్రస్తుత కాలంలో దీని ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అలాగే మాంసం ధర ఎక్కువ ఉండడంతో పాటు దీని వల్ల కలిగే మేలు చాలా తక్కువ అని నిపుణులు చెబుతున్నారు.
అలాగే మాంసం జీర్ణం అవ్వడానికి సమయం ఎక్కువగా పడుతుందని అందరూ దీనిని తినలేరని వారు సూచిస్తున్నారు. మాంసం కంటే చాలా తక్కువ ధరలో అలాగే ఎక్కువ మేలు చేసే పదార్థాలు కూడా సహజంగా లభిస్తాయని వాటిని తీసుకోవడం వల్ల మనం బలంగా తయారవవచ్చని నిపుణులు చెబుతున్నారు. తక్కువ ఖర్చులో నీరసాన్ని తగ్గించుకోవాలనుకునే వారు ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని వారు చెబుతున్నారు. నీరసాన్ని తగ్గించే సహజ సిద్దమైన ఆహారాలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. నీరసాన్ని తగ్గించడంలో పల్లీలు మనకు ఎంతో సహాయపడతాయి. ఇవి మనకు విరివిరిగా లభిస్తాయి.
అలాగే మాంసం కంటే తక్కువ ధరలో లభిస్తాయి. ఈ పల్లీలను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు అంది నీరసం తగ్గుతుంది. అలాగే పచ్చి కొబ్బరిని తీసుకోవడం వల్ల కూడా మన శరీరానికి మేలు కలుగుతుంది. కొబ్బరిలో కొలెస్ట్రాల్ ఉండదు. అలాగే మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. రోజూ అర చిప్ప పచ్చి కొబ్బరిని తినడం వల్ల మన నీరసం, బలహీనత వంటి సమస్యల నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. అదే విధంగా పుచ్చగింజల పప్పును తీసుకోవడం వల్ల కూడా మనకు మేలు కలుగుతుంది. మాంసం, చేపలు, జీడిపప్పు కంటే ఈ పుచ్చగింజల పప్పు మన శరీరానికి ఎక్కువ లాభాన్ని చేకూర్చుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పుచ్చగింజలను పప్పును నానబెట్టి తీసుకోవడం వల్ల నీరసం మన దరి చేరకుండా ఉంటుందని శరీరం బలంగా తయారవుతుందని నిపుణులు చెబుతున్నారు.
అదే విధంగా ప్రొద్దు తిరుగుడు పప్పును తీసుకోవడం వల్ల కూడా మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఇవి తినేటప్పుడు వెగట వస్తాయి కనుక వీటిని తక్కువ మోతాదులో నానబెట్టి తీసుకోవాలి. ఇక గుమ్మడి గింజల పప్పును తీసుకోవడం వల్ల కూడా శరీరం బలంగా, ఆరోగ్యవంతంగా తయారవుతుంది. పైన చెప్పిన ఈ పదార్థాలను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరానికి కావల్సిన పోషకాలు అందుతాయి. వివిధ రకాల అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. నీరసం, బలహీనత వంటివి తగ్గుతాయి. ఈ విధంగా ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల చాలా తక్కువ ధరలో శరీరాన్ని బలంగా, ధృడంగా,ఆరోగ్యంగా మార్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.