హెల్త్ టిప్స్

ఈ ఆహారాల‌ను తీసుకుంటే మీ గుండెకు 100 ఏళ్లు గ్యారెంటీ..

రక్తంలో కొల్లెస్టరాల్, ట్రిగ్లీసెరైడ్ స్ధాయిలు అధికమయ్యాయని మీ ఫేవరేట్ ఆహారాలు ఆపేశారా? అవసరం లేదు. వీటిని మంచి కొల్లెస్టరాల్ ఆహారాలతో భర్తీ చేయండి. రక్తంలో చెడు కొల్లెస్టరాల్ అధికమైతే, దానిని మంచి కొల్లెస్టరాల్ ఆహారాలతో తొలగించి ఆరోగ్యం పొందవచ్చు. మరి శరీరంలో మంచి కొల్లెస్టరాల్ వుండాలంటే, ఏ ఆహారాలు తినాలో చూడండి. ఆరెంజ్ జ్యూస్ – ఇంటిలో తయారు చేసిన తాజా ఆరెంజ్ రసం లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా వుండి రక్తనాళాలలోని గడ్డలను కరిగిస్తుంది. ప్రతిరోజూ ఒక్క గ్లాసెడు ఆరెంజ్ జ్యూస్ గుండె ఆరోగ్యానికి సహకరిస్తుంది.

వెల్లుల్లి – సాధారణంగా ఇంటిలో వాడే వెల్లుల్లి కూడా మంచి కొల్లెస్టరాల్ అధికంగా వుండే ఆహారం. ఇది రక్తనాళాలలోని లోపలి అంచులు గట్టిపడకుండా చేస్తుంది. రక్తనాళాలు కొల్లెస్టరాల్ రహితంగా చేయటమే కాక శరీరానికి మరిన్ని ప్రయోజనాలు కూడా చేకూరుస్తుంది. ప్రతిరోజూ రెండు రెబ్బలు వెల్లుల్లి తింటే ఎంతో మేలని వైద్యులు చెపుతున్నారు.

take these foods regularly for your heart health

రెడ్ వైన్ – ఆల్కహాల్ తాగటం అలవాటు లేని వారికి కూడా ఇది బాగుంటుంది. ఇది ఇంచుమించుగా ద్రాక్షరసంతో సమానం. కొల్లెస్టరాల్ స్ధాయిలను ఇది సాధారణంగా వుంచుతుంది. రెడ్ వైన్ తగుమాత్రంగా తాగితే గుండెకు రక్త సరఫరా చేసే రక్తనాళాలు ఎప్పటికపుడు శుభ్రపడి రక్తసరఫరా స్వేచ్ఛగా జరిగేలా చూస్తాయి.

Admin

Recent Posts