హెల్త్ టిప్స్

ఈ ఫుడ్స్‌ను తింటే చాలు.. మీ లివ‌ర్ మొత్తం క్లీన్ అయిపోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">మీరు గానీ మీ కుటుంబంలో కానీ ఎవరైనా లివర్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా&period;&period; అయితే ఇప్పుడు చెప్పబోయే టిప్స్ మీకోసమే&period; మన శరీరంలో ఉన్న అవయవాలలో లివర్ చాలా ముఖ్యమైంది&period; ఇది మనం తినే ఆహారాన్ని జీర్ణం చేయడంతోపాటు&comma; రక్త‌సరఫరాను మెరుగుపరుస్తుంది&period; ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది&period; అలాగే మనం తినే ఆహారంలో ఉండే పోషకాలను శోషించుకొని శరీరానికి అందిస్తుంది&period; అందువల్ల లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవాలి&period; లివర్ మన శరీరంలో 500 రకాలకు పైగా జీవ క్రియలను నిర్వహిస్తుంది&period; అయితే లివర్ కొన్ని సందర్భాల్లో డామేజ్ అవుతుంటుంది&period; అందుకు మనం పాటించే అలవాట్లు&comma; తినే ఆహారమే కారణమని చెప్పవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే లివర్ పనితీరు సరిగా లేనివారు కింద తెలిపిన ఆహారాలను తీసుకుంటే లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు&period; ఇక ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period; ఆకుపచ్చని కూరగాయలైన పాలకూర&comma; మెంతికూర&comma; కొత్తిమీర వంటి ఆకుకూరల‌ను తీసుకుంటే లివర్ పనితీరు మెరుగుపడుతుంది&period; అలాగే బ్లూబెర్రీలు&comma; స్ట్రాబెర్రీలు వంటి బెర్రీ పండ్ల‌ను కూడా ఆహారంలో భాగం చేసుకోవచ్చు&period; వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి&period; ఇవి లివర్ డ్యామేజ్ అవ్వకుండా చూస్తాయి&period; దీంతోపాటు లివర్ వాపు కూడా తగ్గుతుంది&period; లివర్ పని తీరు మెరుగు పడుతుంది&period; మనం తినే ఆహారంలో ఉండే పోషకాలను లివర్ à°¸‌రిగ్గా శోషించుకుంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-48627 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;09&sol;liver-1&period;jpg" alt&equals;"take these foods to clean your liver " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నేరేడు పండ్లు కూడా లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఎంతగానో సహాయం చేస్తాయి&period; నేరేడు పండ్ల‌లో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి&period; అలాగే గ్రేప్ జ్యూస్&comma; బీట్రూట్ జ్యూస్&comma; ఉసిరికాయ జ్యూస్&comma; అలోవెరా జ్యూస్ కూడా తాగవచ్చు&period; ఇవన్నీ లివర్‌కు ఎంతగానో మేలు చేస్తాయి&period; లివర్‌లోని వ్యర్థాలను బయటకు పంపుతాయి&period; అయితే నాన్ వెజ్ ఎక్కువగా తినడం వల్ల లివర్ పనితీరు మందగిస్తుంది&period; కనుక నాన్ వెజ్‌ను తక్కువగా తీసుకోవాలి&period; అయితే చేపలను ఎక్కువగా తీసుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎందుకంటే వాటిలో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి&period; ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల కూడా లివర్ పనితీరు మెరుగుపడుతుంది&period; లివ‌ర్‌ వ్యాధి నుంచి త్వరగా కోలుకోవచ్చు&period; రోజూ పసుపును ఆహారంలో భాగం చేసుకుంటే లివర్ వ్యాధులు తగ్గుతాయి&period; రోజూ రాత్రి పాలలో కాస్త పసుపు కలిపి తాగితే లివర్ పనితీరు మెరుగుపడుతుంది&period; రోజూ తగినంత నీళ్లను తాగడం వల్ల కూడా లివర్ పనితీరును మెరుగుపరుచుకోవచ్చు&period; ఈ విధంగా పలు చిట్కాలను పాటిస్తే లివ‌ర్ ను ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు&period; దీంతో లివర్ సంబంధ‌ వ్యాధులు రాకుండా ఉంటాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts