Digestion : ఉష్ణోగ్రతలు రోజుకు రోజుకు పెరుగుతున్నాయి. ఎండ నుండి ఉపశమనాన్ని పొందడానికి ప్రజలు రకరకాల ప్రయత్నాలు పాటిస్తున్నారు. ఎక్కువగా చల్లగా ఉండే పానీయాలను, ఆహారాలను తీసుకుంటూ ఉంటారు. అయితే వేసవికాలంలో మనలో వివిధ రకాల అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతూ ఉంటాయి. ముఖ్యంగా వేసవికాలంలో చాలా మంది జీర్ణ సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. కడుపు ఉబ్బరం, మలబద్దకం, ఆకలి లేకపోవడం, అజీర్తి వంటి సమస్యలతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. వేసవి కాలంలో పొట్ట ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియా, సూక్ష్మజీవుల శాతం ఎక్కువగా ఉంటే పొట్ట ఆరోగ్యం గా ఉంటుంది. జీర్ణవ్యవస్థ సరిగ్గా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము. లేదంటే అనేక అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. వేసవికాలంలో ఎక్కువగా మనం శరీరాన్ని చల్లబరిచే ఆహారాలను తీసుకోవాలి.
అదే సమయంలో మనం తీసుకునే ఆహారం మన జీర్ణవ్యవస్థను కూడా మెరుగుపరిచేదై ఉండాలి. వేసవికాలంలో తలెత్తే జీర్ణ సమస్యలతో బాధపడే వారు కిం తెలిపే ఆహారాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ ఆహారాలు జీర్ణవ్యవస్థను మెరుగుపరచగడంతో పాటు శరీరానికి కూడా చలువ చేస్తాయి. వేసవికాలంలో తీసుకోదగిన ఆహారాలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. వేసవికాలంలో ఎక్కువగా మనం పెరుగన్నాన్ని తీసుకోవాలి. పెరుగన్నం శరీరాన్ని చల్లబరచడంతో పాటు జీర్ణవ్యవస్థను కూడా మెరుగుపరుస్తాయి. దీనిలో ప్రోబయాటిక్స్ తో పాటు శరీరానికి మేలు చేసే విటమిన్స్, మినరల్స్ కూడా ఉంటాయి. ఒక కప్పు నిండుగా పెరుగన్నాన్ని తీసుకోవడం వల్ల పొట్ట ఆరోగ్యం మెరుగుపడుతుంది.
అలాగే వేసవికాలంలో ఓట్స్ ను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంతో పాటు పొట్ట నిండుగా ఉండేలా చేస్తాయి. ఓట్స్ ను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. అదే విధంగా వేసవికాలంలో మజ్జిగను ఎక్కువగా తీసుకోవాలి. మజ్జిగను తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యలు తగ్గడంతో పాటు శరీరానికి చలువ కూడా చేస్తుంది. అలాగే మజ్జిగను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అలాగే చిరు ధాన్యాలను తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. చిరు ధాన్యాలల్లో పోషకాలు ఉండడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇవి ఎంతగానో సహాయపడతాయి. వీటిని తీసుకోవడం వల్ల ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియా శాతం పెరుగుతుంది. అదే విధంగా వేసవికాలంలో ఎక్కువగా మొలకెత్తిన పెసర్లతో చేసిన సలాడ్ ను తీసుకోవాలి.
వీటిలో ఫైబర్, ఎంజైమ్స్, విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. జీర్ణశక్తిని మెరుగుపరిచి మలబద్దకాన్ని తగ్గించడంలో ఇవి ఎంతగానో సహాయపడతాయి. అంతేకాకుండా పెసర్ల సలాడ్ ను తీసుకోవడం వల్ల శరీరానికి కూడా చలువ చేస్తుంది. అదే విధంగా వేసవికాలంలో చియా విత్తనాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మలబద్దకాన్ని తగ్గించడంలో, బరువు తగ్గేలా చేయడంలో, రక్తపోటును అదుపులో ఉంచడంలో, శరీరాన్ని చల్లబరచడంలో ఇలా అనేక రకాలుగా చియా విత్తనాలు మనకు సహాయపడతాయి. వేసవికాలంలో ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అలాగే శరీరానికి కూడా చలువ చేస్తుంది. వడదెబ్బ బారిన పడకుండా ఉంటాము. ఎండ వల్ల కలిగే నీరసం బారిన పడకుండా ఉంటాము.