శరీర మెటబాలిజం అనేది కొవ్వును కరిగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మెటబాలిజం సరిగ్గా ఉన్నవారి బరువు నియంత్రణలో ఉంటుంది. అంటే.. వారిలో క్యాలరీలు సరిగ్గా ఖర్చవుతున్నట్లు లెక్క. కానీ కొందరికి మెటబాలిజం చాలా తక్కువగా ఉంంటుంది. అందుకు అనేక కారణాలు ఉంటాయి. అయితే అలాంటి వారు మెటబాలిజంను గాడిలో పెడితే దీంతో వారిలో కూడా క్యాలరీలు సరిగ్గా ఖర్చవుతాయి. ఫలితంగా కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. బరువు నియంత్రణలో ఉంటుంది.
మెటబాలిజం అంటే.. మన శరీరం క్యాలరీలను కరిగించే రేటు అన్నమాట. దీన్ని పెంచుకోవడం ద్వారా కొవ్వును కరిగించవచ్చు. దీంతో అధిక బరువు తగ్గుతారు. అయితే మన శరీర మెటబాలిజంను పెంచుకునేందుకు పలు పదార్థాలు ఉపయోగపడతాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. మిరపకాయలు
మిర్చిలో క్యాప్సెయిసిన్ అనబడే సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటుంది. ఈ క్రమంలో మిర్చిని ఆహారంలో భాగం చేసుకుంటే మెటబాలిజం సహజంగానే పెరుగుతుంది. నిత్యం కనీసం 3 గ్రాముల వరకు మిర్చిని తింటే ఫలితం ఉంటుంది. మెటబాలిజం మెరుగు పడుతుంది. అయితే ఎక్కువగా మిర్చిని తీసుకోరాదు. గ్యాస్, అసిడిటీ, కడుపులో మంట వంటి సమస్యలు తలెత్తుతాయి. కనుక వీటిని పరిమితంగా తీసుకుంటేనే లాభాలు కలుగుతాయి.
2. గ్రీన్ టీ
గ్రీన్ టీలో ఫ్లేవనాయిడ్స్, కెఫీన్ ఉంటాయి. ఇవి మెటబాలిజంను బాగా పెంచుతాయి. దీని వల్ల కొవ్వు కరుగుతుంది. అలాగే శరీరంలో ఎక్కువగా ఉండే ద్రవాలు బయటకు వెళ్లిపోతాయి. నిత్యం 3 నుంచి 4 కప్పుల వరకు గ్రీన్ టీని సేవిస్తే ఫలితం ఉంటుంది. గ్రీన్ టీని మధ్యాహ్నం భోజనం చేశాక, సాయంత్రం సమయంలో, రాత్రి నిద్రకు ఉపక్రమించడానికి 1 గంట ముందు తాగితే ఫలితం ఉంటుంది.
3. దాల్చిన చెక్క
దాల్చినచెక్కలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. అందువల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. నిత్యం ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని కలిపి రోజూ రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు తాగితే ఫలితం ఉంటుంది. ఈ పొడిని సలాడ్లు, జ్యూస్‌లలోనూ కలుపుకుని తీసుకోవచ్చు. దీని వల్ల శరీర మెటబాలిజం పెరగడమే కాక కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు.
4. అల్లం
అల్లంలో 6-జింజరాల్, 8-జింజరాల్ అనబడే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీరంలో వేడిని పెంచుతాయి. చెమట ఎక్కువగా వచ్చేలా చేస్తాయి. దీంతో మెటబాలిజం పెరుగుతుంది. క్యాలరీలు ఖర్చవుతాయి. కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. బరువు నియంత్రణలో ఉంటుంది. జీర్ణశక్తి కూడా పెరుగుతుంది. పేగులు, జీర్ణవ్యవస్థకు బలం కలుగుతుంది. నిత్యం చిన్న అల్లం ముక్కను పరగడుపునే తినాలి. లేదా 2 టీస్పూన్ల అల్లం రసం కూడా సేవించవచ్చు. అలాగే జ్యూస్‌లు, సలాడ్ లలోనూ అల్లం రసంను తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా లాభాలే ఉంటాయి.