Thyroid : థైరాయిడ్ సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. థైరాయిడ్ నుండి బయట పడాలంటే కొన్ని ఆహార పదార్థాలు బాగా ఉపయోగపడతాయి. థైరాయిడ్ సమస్య నుండి బయటకి వచ్చేయాలంటే కొన్ని రకాల పద్ధతుల్ని కచ్చితంగా పాటించాలి. భారతదేశంలో 42 మిలియన్ల మంది థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నట్లు రిపోర్టు ద్వారా తెలుస్తోంది. మగవాళ్ళ కంటే స్త్రీలలో థైరాయిడ్ ముప్పు పది రెట్లు ఎక్కువగా ఉంటుంది.
ప్రతి ఎనిమిది మంది మహిళల్లో ఒకరు థైరాయిడ్ తో బాధపడుతున్నారు. థైరాయిడ్ హార్మోన్ సరిగ్గా పని చేస్తేనే ప్రతి కణం సరిగ్గా పనిచేస్తుంది. జీవక్రియ పనితీరు కూడా బాగుంటుంది. థైరాయిడ్ పెరిగినప్పుడు హైపర్ థైరాయిడిజమ్ అంటారు. అంటే థైరాయిడ్ హార్మోన్లు ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయి. థైరాయిడ్ గ్రంధి తక్కువగా పనిచేస్తే హైపో థైరాయిడిజమ్ అంటారు.
థైరాయిడ్ ని అదుపులో ఉంచుకోవాలంటే, ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. థైరాయిడ్ సమస్య నుండి బయటపడడానికి గుమ్మడి గింజలను తీసుకోవడం మంచిది. ఇందులో జింక్, సెలీనియం, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. కరివేపాకును కూడా తీసుకుంటూ ఉండండి. కరివేపాకుని తీసుకోవడం వలన కూడా థైరాయిడ్ పనితీరు బాగుంటుంది. సబ్జా గింజల నీళ్లు తాగితే కూడా థైరాయిడ్ సమస్యకు చెక్ పెట్టొచ్చు. సబ్జా గింజల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ థైరాయిడ్ గ్రంధి పనితీరుని మెరుగు పరుస్తాయి.
సబ్జా గింజల్లో పొటాషియం, కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ఐరన్ కూడా ఎక్కువగా లభిస్తాయి. పెరుగుని కూడా తీసుకోండి. ఇది ప్రోబయోటిక్ సూపర్ ఫుడ్. పేగుల ఆరోగ్యాన్ని పెరుగు కాపాడుతుంది. థైరాయిడ్ సమస్య ఆటో ఇమ్యూన్ వ్యాధి కారణంగా వస్తుంది. ఇమ్యూనిటీని మెరుగుపరచడానికి, పేగులని ఆరోగ్యంగా ఉంచడానికి పెరుగును తప్పక తీసుకోవాలి. ఇలా వీటిని తీసుకుంటే థైరాయిడ్ నార్మల్ అవుతుంది.